జనసేనకు బీసీలు మద్దతు ఇవ్వాలి
వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థి గడల శ్రీనివాస్ రావు
హనుమకొండ అర్బన్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): ఖమ్మం వరంగల్ నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో(Graduate MLC Election) బీసీలు జనసేనకు మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాస్ కోరారు. హన్మకొండ నయమ్ నగర్ బిసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ ను కలసి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ప్రధాన పార్టీ లు అన్ని అగ్రవర్ణాలకు టికెట్ లు కేటాయిస్తున్నాయని, జనాభాలో 60 శాతం ఉన్న బీసీ ల పట్ల అన్ని రాజకీయ పార్టీ లు చిన్న చూపు చూస్తున్నాయన్నారు.
వడ్లకోండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అభిప్రాయం ప్రకారం వరంగల్ ఉమ్మడి జిల్లా బిసి సంక్షేమ సంఘం నిర్ణయం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర నాయకులు ప్రభాకర్ గౌడ్, పద్మజ దేవి, రాము యాదవ్, పృథ్వి, రామకృష్ణ, అక్షయ్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు గడ్డం రాజు, సాంబశివుడు, నరేష్ యాదవ్, సతీష్ గౌడ్, సమ్మయ్య, సుమన్, నాగరాజు పాల్గొన్నారు.