మూడు దశాబ్దాల సేవలకు ఘన సత్కారం
ఇల్లెందు,(విజయక్రాంతి): సింగరేణి ఇల్లందు ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం(Singareni Yellandu Area General Manager's Office)లో విధులు నిర్వహిస్తూ ఉద్యోగ విరమణ పొందిన రంప తేజవతిని ఏరియా జనరల్ మేనేజర్ వి. కృష్ణయ్య(Area General Manager V. Krishnaiah) ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ, రంప తేజవతి 30 ఏళ్ల పాటు సింగరేణి సంస్థలో అంకితభావంతో సేవలందించి సంస్థ అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు.
వివిధ గనులు, విభాగాల్లో బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ అధికారులు, సహోద్యోగుల మన్ననలు పొందారని తెలిపారు. ఉద్యోగ విరమణ అనంతరం ఆమె జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీజీఎం (పర్సనల్) అజ్మీర తుకారం, డీజీఎం (ఐడీ) ప్రభాకర్‌రావు, డీజీఎం (ఎఫ్ అండ్ ఏ) నాగలక్ష్మి, ఏరియా సర్వే ఆఫీసర్ రామ్మూర్తి, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ జి. సుధాకర్‌తో పాటు అధికారులు, ఉద్యోగులు పాల్గొని తేజవతికి శుభాకాంక్షలు తెలిపారు.