పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి

31-10-2026 | 06:00pm

బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి గుగులోతు రామస్వామి నాయక్‌

గణపురం,(విజయక్రాంతి): రానున్న వరంగల్‌–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఓడీసీఎంఎస్‌ చైర్మన్‌ గుగులోతు రామస్వామి నాయక్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం గణపురం మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మోతె కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఓటరు నమోదుకు నవంబర్‌ 6 చివరి తేదీ కావడంతో ఇంకా నమోదు చేసుకోని పట్టభద్రులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, ప్రభుత్వ విధానాలపై తమ తీర్పును తెలియజేసేందుకు పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పోలుసాని లక్ష్మీనరసింహారావు, మాజీ పీఏసీఎస్‌ చైర్మన్‌ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, సర్పంచులు ఉడుత సాంబయ్య యాదవ్‌, కొడారి హైమావతి ధనుంజయ్‌, మద్దెల విజయఅశోక్‌, మాజీ ఎంపీటీసీ మంద అశోక్‌రెడ్డి, నాయకులు గంజి జన్నయ్య, కసిరెడ్డి వెంకన్న, గ్రామశాఖ అధ్యక్షుడు హఫీజ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు