పాస్టర్ శేఖర్‌ను పరామర్శించిన జిల్లా పాస్టర్స్ కమిటీ
కోనరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా పాస్టర్స్ కమిటీ(Rajanna Sircilla District Pastors Committee) సభ్యులు కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన పాస్టర్ గంగాధరి శేఖర్(Pastor Gangadhari Sekhar)ను పరామర్శించారు. ఇటీవల ఆపరేషన్ చేయించుకుని ఇంటికి వచ్చిన ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ధైర్యం చెబుతూ, క్రైస్తవ సంఘం తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా జిల్లా పాస్టర్స్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. క్రైస్తవ సమాజంలో పాస్టర్ల సేవలు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. ప్రజలకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందిస్తూ, విశ్వాసం, ప్రేమ, సేవాభావంతో సంఘ అభివృద్ధికి పాస్టర్లు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. దేవుని సేవలో ఎన్నో సవాళ్లు ఎదురైనా విశ్వాసంతో ముందుకు సాగడం గొప్ప విషయమని అన్నారు. ఒకరి కష్టాన్ని మరొకరు తమ కష్టంగా భావించి, ఆపద సమయంలో పరస్పరం అండగా నిలవడం క్రైస్తవ ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు.
క్రైస్తవ సంఘం ఆరాధనలకే పరిమితం కాకుండా ప్రేమ, ఐక్యత, పరస్పర సహకారం, సేవాభావంతో ఒక కుటుంబంలా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.పాస్టర్ గంగాధరి శేఖర్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, దేవుని కృపాకటాక్షాలు ఆయన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కష్టసమయాల్లో పాస్టర్లకు, వారి కుటుంబాలకు జిల్లా పాస్టర్స్ కమిటీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా పాస్టర్స్ కమిటీ అధ్యక్షుడు జీవన్ ఇండియా, ప్రధాన కార్యదర్శి కుమ్మరి రాజేష్, ఉపాధ్యక్షుడు ఎలీషా, సహాయ కార్యదర్శి నతానియల్, జోషెప్, ప్రభుదాస్, ఫ్రాన్సిస్, విద్యానందం, జిల్లా మీడియా కన్వీనర్ కులేరి కిషోర్ కుమార్‌తో పాటు పలువురు కమిటీ ప్రతినిధులు, పాస్టర్లు పాల్గొన్నారు.