350 కిలోల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

16-09-2026 | 11:50pm

ఇద్దరిపై 6ఏ కేసు.. ఆటో సీజ్

టేకులపల్లి, (విజయక్రాంతి): మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో బుధవారం వాహన తనిఖీల్లో 350 కిలోల అక్రమ రేషన్ బియ్యాన్ని(Illegal ration rice) పోలీసులు పట్టుకున్నారు. తడికలపూడి నుంచి లక్ష్మీపురం వైపు వస్తున్న ఆటోను తనిఖీ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా.. డ్రైవర్ గుగులోత్ కుమార్ ఆటోను వెనక్కి తిప్పి పారిపోయేందుకు యత్నించాడు.

దీంతో పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. ఆటోను తనిఖీ చేయగా 350 కిలోల రేషన్ బియ్యం లభించింది. విచారణలో తడికలపూడి పరిసర గ్రామాల్లో రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి కారేపల్లికి చెందిన బానోత్ కోటేష్‌కు విక్రయిస్తున్నట్లు కుమార్ తెలిపినట్లు ఎస్సై తిరుపతి పేర్కొన్నారు. ఇద్దరిపై 6ఏ కేసు నమోదు చేసి బియ్యం, ఆటోను సీజ్ చేసినట్లు తెలిపారు. బియ్యాన్ని పట్టుకున్న ఎస్సై తిరుపతి, ఏఎస్సై నరసింహారావు, సిబ్బందిని సీఐ సత్యనారాయణ అభినందించారు.

మరిన్ని వార్తలు