అక్షిత రాణి ఆత్మహత్యకు కారకులైన వారిపై కేసు నమోదు చేయాలి...

16-09-2026 | 11:09pm

సుల్తానాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): బీటెక్ విద్యార్థి తాండ్ర అక్షిత రాణి ఆత్మహత్యకు కారకులైన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు(SC/ST Atrocity Case) నమోదు చేయాలని, ప్రభుత్వం ఆ కుటుంబానికి అండగా నిలవాలని పౌర హక్కుల సంఘం వారు కోరారు, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని రేగడి మద్దికుంట గ్రామానికి బుధవారం వారు వెళ్లి మృతురాలి అక్షిత తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి, పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ ఉపాధ్యక్షుడు నారా వినోద్, పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ ఈసీ సభ్యులు బండారి రాజలింగు, పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ సభ్యులు బండి శంకర్, పెద్దపల్లి జిల్లా ప్రజాసంఘాల నాయకుడు బండి సతీష్ లు మాట్లాడుతూ మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల పరిహారం  చెల్లించడంతోపాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నారు....

మరిన్ని వార్తలు