దానం అనర్హతపై తీర్పు వాయిదా
16-09-2026 | 05:56pm
హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(MLA Danam Nagender) అనర్హత పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు(Telangana High Court) తీర్పును వాయిదా వేసింది. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసినట్లు ధర్మాసనం పేర్కొంది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో చేరారని ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Gaddam Prasad Kumar)కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. చట్టపరంగా ఆయన పార్టీ మారలేదంటూ స్పీకర్ తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పులను శుక్రవారానికి వాయిదా వేసింది.