వివేకా హత్య కేసు.. డిశ్చార్జ్‌ పిటిషన్లు కొట్టివేత

16-09-2026 | 06:03pm

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి(Vivekananda Reddy) హత్య కేసు విచారణలో నాంపల్లిలోని ప్రత్యేక సీబీఐ(CBI) కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. తమపై నమోదైన అభియోగాల నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ ప్రధాన నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జ్‌ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది.

కేసులో ఏ1 ఎర్ర గంగిరెడ్డి, ఏ3 ఉమాశంకర్‌ రెడ్డి, ఏ6 గజ్జల ఉదయ్‌ కుమార్‌ రెడ్డి దాఖలు చేసిన వేర్వేరు డిశ్చార్జ్‌ పిటిషన్లపై కోర్టు విచారణ చేపట్టింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లు, సాంకేతిక ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించిన అనంతరం.. నిందితులపై ఉన్న అభియోగాలు విచారణకు అర్హమైనవేనని న్యాయస్థానం పేర్కొంది.

నిందితులు డిశ్చార్జ్‌ కావడానికి తగిన ఆధారాలు లేవని కోర్టు అభిప్రాయపడింది. దీంతో ముగ్గురు నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జ్‌ పిటిషన్లను తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో కేసు విచారణ తదుపరి దశకు వెళ్లేందుకు మార్గం సుగమమైంది.

మరిన్ని వార్తలు