ఒకే బంధు వర్గానికి...పదవులా...?
- మున్నూరు కాపు సంఘం మూడు ముక్కలు కావడానికి కారణం మీరు కాదా...?
- కలిసి పోవడానికి మేము సిద్ధమే... త్వరలో జిల్లా, నగర కమిటీలు వేస్తాం
ఖమ్మం, అక్టోబర్ 13(విజయక్రాంతి): మున్నూరు కాపు సంఘంలో(Munnuru Kapu Association) ఒకే బంధు వర్గానికి పదవులా అని ఆ సంఘం నాయకులు ప్రశ్నించారు. ఖమ్మం లోని రాపర్తి శరత్ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో మున్నూరు కాపు సంఘం సీనియర్ రాష్ట్ర నాయకులు శెట్టి రంగారావు, మాజీ కార్పొరేటర్, సంఘం నగర అధ్యక్షులు రాపర్తి శరత్ మాట్లాడారు.
సీనియర్ నాయకులు మేకల సంగయ్య ఫోటో లేకుండా ఫ్లెక్సీలు వేశారని, ఇది అవమానకరమని అన్నారు. అందరూ కలిసి ఉండాలని అనే ఉద్దేశ్యంతో ఏనాడూ సంఘంలో పని చెయ్యని శీలంశెట్టి వీరభద్రం ను జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించినా తాము అంగీకరించామన్నారు. 11 ఏళ్ల నుండి సంఘాన్ని అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుకున్నదెవరో అందరికీ తెలుసునన్నారు.
రాపర్తి కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిని నగర అధ్యక్షులు గా నియమించినందుకు కుట్ర చేశారన్నారు. ఆత్మీయ సమ్మేళనానికి తమను ఎందుకు పిలువలేదో చెప్పాలన్నారు. కలిసిపోయే గుణముంటే తమను పిలిపించి మాట్లాడాలి కదా అన్నారు. కలిసిపోవడానికి తాము సిద్ధమేనన్నారు. లేకుంటే కుల పెద్దలను సంప్రదించి తమ పని తాము చేసుకపోతామన్నారు.
త్వరలోనే జిల్లా, నగర కమిటీలు వేస్తామన్నారు. ఈ సమావేశం లో ట్రస్టు బోర్డు సెక్రటరీ కలిశెట్టి నర్సయ్య, గౌరవ సలహాదారులు మూలగుండ్ల శ్రీహరి, నగర కార్యదర్శి బైరిశెట్టి శ్రీనివాస్, కోశాధికారి గంగిశెట్టి శ్రీనివాస్, కోయచలక ఉప సర్పంచ్ మాధవశెట్టి హన్మంతరావు, కార్మిక విభాగం అధ్యక్షుడు విప్లవ కుమార్, మహిళా విభాగం నాయకురాలు బాసెట్టి శ్రావ్య, నాయకులు బైరిశెట్టి పవన్ కుమార్, పసుపు లేటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.