వనజీవి రామయ్య సేవలు చిరస్మరణీయం

13-10-2026 | 07:11pm

ఆయన సతీమణికి బీజేవైఎం ఘన సత్కారం. 

ఖమ్మం, అక్టోబర్ 13(విజయక్రాంతి): ప్రతి మొక్కనూ తన కుటుంబ సభ్యుడిగా భావించి, తుదిశ్వాస వరకు పర్యావరణ పరిరక్షణకే అంకితమైన మహోన్నత వ్యక్తి పద్మశ్రీ స్వర్గీయ వనజీవి రామయ్య(Vanajivi Ramayya ) అని పలువురు నాయకులు కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) 25 ఏళ్ల సుపరిపాలనను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న.

'సేవా సంకల్ప్ అభియాన్' కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం రెడ్డిపల్లి గ్రామంలో బీజేవైఎం ఆధ్వర్యంలో రామయ్య సతీమణి జానమ్మను ఘనంగా సత్కరించారు. రామయ్య ఇంటికి వెళ్లిన నాయకులు, ఆయన ప్రకృతికి చేసిన అపారమైన సేవలను స్మరించుకుంటూ జానమ్మను శాలువాతో సన్మానించి గౌరవించారు.

ఈ సందర్భంగా బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ.. వనజీవి రామయ్య ఆశయ సాధన కోసం యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం ఖమ్మం జిల్లా అధ్యక్షులు శాసనాల శ్రీరామ్, జిల్లా ఉపాధ్యక్షులు నకిరికంటి వీరభద్రం, బీజేవైఎం రాష్ట్ర నాయకులు నలమాస శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తా నాగేంద్రబాబు, జిల్లా కోశాధికారి ఆకుల నరేష్ గుప్తా, బీజేవైఎం నాయకులు చిర్రా నరేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు