తుఫాను బాధితులకు అండగా ఉంటాం

25-09-2026 | 04:10pm

* ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

దమ్మపేట, సెప్టెంబర్ 25(విజయక్రాంతి): నిన్నటి వరకు కురిసిన భారీ తుఫాను వర్షాలకు(Heavy cyclonic rains) దెబ్బతిన్న రోడ్లను, పంట పొలాలను అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారె ఆదినారాయణ(Jare Adinarayana) మండల పరిధిలోని జగ్గారం గ్రామపంచాయతీ(Jaggaram Gram Panchayat)లో పర్యటించి పరిశీలించారు. ఈ పర్యటనలో భాగంగా సుడిగాలి తీవ్రతకు నేలకొరిగిన ఆయిల్ ఫామ్, జీడిమామిడి తోటలను(Cashew plantations) క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టపోయిన రైతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యం వల్ల రైతాంగానికి జరిగిన నష్టం అత్యంత విచారకరమన్నారు. రైతులు అధైర్యపడొద్దని, పంట నష్టానికి సంబంధించిన నివేదికలను ప్రభుత్వానికి సమర్పించి బాధితులందరికీ ప్రభుత్వం నుంచి తగిన నష్టపరిహారం అందేలా తన వంతుగా కృషి చేస్తానని  హామీ ఇచ్చారు. అలాగే దెబ్బతిన్న రహదారులకు త్వరితగతిన మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వంకా జానకీ రామ్, ప్రజాప్రతినిధులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు