రూ.93 వేల మద్యం స్వాధీనం

25-09-2026 | 04:07pm

నిర్మల్ సెప్టెంబర్ 24 ( విజయ క్రాంతి) : గ్రామాల్లో నిబంధనల విరుద్ధంగా బెల్ట్ షాపులు(Illegal liquor outlets) నడిపిస్తున్న దుకాణాలపై శుక్రవారం పోలీసులు దాడి చేశారు. నిర్మల్ రూరల్ మండలం ఎల్లపల్లి గ్రామంలో అక్రమంగా విక్రయిస్తున్న మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై లింబాద్రి తెలిపారు. గ్రామానికి చెందిన గుండ్ల నవీన్ అనే వ్యక్తి అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు అందిన సమాచారంతో గురువారం అర్ధరాత్రి పోలీసులు దాడి నిర్వహించారు.

ఈ సందర్భంగా బెల్ట్ షాప్ లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 93 వేల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. గ్రామాల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.

మరిన్ని వార్తలు