6 September, 2026 | 10:27 AM

జపాన్ జాయింట్ రీసెర్చ్ ప్రోగ్రామ్‌కు యువ పరిశోధకురాలు

06-09-2026 | 08:53am

పినపాక మండల ప్రముఖ రిపోర్టర్ రమణ కుమార్తె  

పినపాక /మణుగూరు, సెప్టెంబర్ 6,(విజయక్రాంతి): విజయవాడ ఎంబెడెడ్ సిస్టమ్స్‌లో ఎంటెక్ అభ్యసిస్తున్న పినపాక మండల కేంద్రానికి చెందిన సిరి చందన ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. జపాన్‌తో కలిసి నిర్వహిస్తున్న జాయింట్ రీసెర్చ్ ప్రోగ్రామ్‌కు(Joint Research Program) పరిశోధకురాలిగా ఎంపికైంది. ఈ పరిశోధన కార్యక్రమంలో భాగంగా ఆమెకు సుమారు రూ.1.40 లక్షల స్టైపెండ్ లభించనుంది.

ఈ అవకాశాన్ని సాధించడంలో కేఎల్  యూనివర్సిటీ(KL University), విజయవాడకు చెందిన గైడ్ డా. వెంకట రత్నం అందించిన నిరంతర సహకారం, మార్గదర్శకత్వం కీలకంగా నిలిచాయి. ఆమె కష్టపడి పనిచేసే స్వభావం, పట్టుదల, ఎన్ని సవాళ్లు ఎదురైనా వెనుకడుగు వేయని నైజం ఈ విజయానికి కారణమయ్యాయని ఆమె తల్లిదండ్రులు ఊటుకూరి వెంకటేశ్వరరావు ( రమణ) రాధా( ఉపాధ్యాయురాలు)   తెలిపారు.జపాన్‌తో చేపట్టనున్న సంయుక్త పరిశోధన కార్యక్రమంలో ఆమె ప్రతిభను చాటుకోవాలని, పరిశోధన విజయవంతంగా సాగి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత అవకాశాలు అందుకోవాలని కుటుంబ సభ్యులు ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు