ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి
06-09-2026 | 09:40am
ఎర్రవల్లి, సెప్టెంబర్ 06: జోగులాంబ గద్వాల జిల్లా ఎన్‌హెచ్–44పై(Jogulamba Gadwal District NH-44) ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెన్త్ పఠాలం ఎదురుగా హెచ్‌పీ పెట్రోల్ పంప్ సమీపంలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మౌనిక, సాయికుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. కారును ముఖేష్ నడుపుతున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






