6 September, 2026 | 10:25 AM

బాలికపై లైంగికదాడికి యత్నం.. పోక్సో కేసు

06-09-2026 | 09:05am

బెల్లంపల్లి,(విజయ క్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లి శాంతిఖని బస్తికి చెందిన మూడేళ్ల మైనర్ బాలికపై శనివారం రాత్రి  లైంగిక దాడి యత్నం ఘటన కలకలం రేపింది. బెల్లంపల్లి రూరల్ సీఐ(Bellampalli Rural CI) అనూక్ తెలిపిన వివరాల ప్రకారం.. కంపల్లి కిష్టయ్య బాలికను ఆడిస్తూ ఉంటాడు. అదే చదువుతో సదరు బాలిక పై అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. చిన్నారి తప్పించుకొని  కేకలు వేసుకుంటూ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు చెప్పింది. కుటుంబ సభ్యులు పోలీసులకు  సమాచారం ఇవ్వడంతో ఘటనస్థలికి వెళ్లి విచారణ చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికను ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడి పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు  సీఐ అనూక్ వెల్లడించారు.

మరిన్ని వార్తలు