ఆదివారం ఓపెన్! ఏ బ్యాంకులు పనిచేస్తాయో తెలుసా?

27-09-2026 | 08:55am

హైదరాబాద్: బ్యాంకు ఖాతాదారులకు కీలక అప్‌డేట్ వచ్చింది. సాధారణంగా ఆదివారం బ్యాంక్ బ్రాంచ్‌లు మూసి ఉంటాయి. కానీ సెప్టెంబర్ 27, 2026 ఆదివారం మాత్రం ప్రభుత్వ రంగ బ్యాంకులు, Regional Rural Banks పనిచేయనున్నాయి. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా మూడు రోజుల బ్యాంకు సమ్మెకు(Bank strike September 2026) పిలుపు రావడంతో, ఆ ప్రభావంతో ఖాతాదారులకు వరుసగా బ్యాంకు సేవల్లో అంతరాయం కలగకుండా ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

RBI అనుమతితో సెప్టెంబర్ 27న బ్యాంక్ బ్రాంచ్‌లు, కార్యాలయాలు, ATM-linked branches, currency chests పనిచేసేందుకు అవకాశం కల్పించారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, Regional Rural Banks సాధారణంగా సేవలు అందించనున్నాయి. అయితే ఇక్కడే ఖాతాదారులకు అసలు కన్ఫ్యూజన్ ఉంది. అన్ని బ్యాంకులు ఈరోజు ఓపెన్ కావు. HDFC Bank, ICICI Bank, Axis Bank, IndusInd Bank వంటి ప్రైవేట్ బ్యాంకులు ఆదివారం సాధారణ సెలవు షెడ్యూల్‌ను అనుసరిస్తున్నట్లు తాజా సమాచారం. అంటే మీ ఖాతా ప్రైవేట్ బ్యాంకులో ఉంటే, బ్రాంచ్‌కు వెళ్లే ముందు సంబంధిత బ్యాంకు స్థానిక బ్రాంచ్ టైమింగ్స్‌ను చెక్ చేసుకోవడం మంచిది.

ఇక అసలు కీలకమైన విషయం సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు జరగనున్న మూడు రోజుల సమ్మె(Bank strike 2026). ఈ సమ్మె ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రైవేట్ రంగ బ్యాంకులు సాధారణంగా ఈ సమ్మె పరిధిలో ఉండవని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లలేని సమయంలో ఖాతాదారులు UPI, మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, ATM వంటి డిజిటల్ సేవలను ఉపయోగించవచ్చు. అయితే నగదు జమ, చెక్ సంబంధిత పనులు, ఇతర బ్రాంచ్-ఆధారిత సేవలు అవసరమైతే ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది.

ఖాతాదారులు తెలుసుకోవాల్సిన తేదీలు

సెప్టెంబర్ 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు, RRBలు పనిచేస్తాయి

సెప్టెంబర్ 28 దేశవ్యాప్త బ్యాంకు సమ్మె ప్రారంభం

సెప్టెంబర్ 29 సమ్మె కొనసాగింపు

సెప్టెంబర్ 30 సమ్మె మూడో రోజు

ప్రైవేట్ బ్యాంకులు సమ్మె ప్రభావం సాధారణంగా ఉండదని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి

మరిన్ని వార్తలు