రూ. 10,000 తగ్గిన ధర

27-09-2026 | 11:19am

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్.. తగ్గిన తాజా ధరలు ఇవే!

బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న మహిళలకు ఇది కాస్త ఊరటనిచ్చే వార్త. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో(Gold Rate Today Hyderabad) పసిడి ధరలు వారం రోజుల్లో తగ్గుముఖం పట్టాయి. బంగారంతో పాటు వెండి ధర కూడా కిందికి వచ్చింది. వారం రోజుల వ్యవధిలో 24 క్యారెట్లతో పాటు 22 క్యారెట్ల బంగారం ధరలు కూడా కిందికి వచ్చాయి. వెండి ధరలోనూ గణనీయమైన తగ్గుదల నమోదైంది. ఈ నెల 20న హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(24 Carat Gold Price Hyderabad) ధర రూ.1,55,840గా ఉండగా.. ఇప్పుడు రూ.1,52,680కి చేరింది.

అంటే వారం రోజుల్లో 10 గ్రాములపై రూ.3,160 తగ్గింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,900 తగ్గి రూ.1,39,950కు చేరింది. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు తాజా మార్కెట్ ధరలపై దృష్టి పెడుతున్నారు. ఇక వెండి విషయానికి వస్తే.. కిలో వెండి(Silver Price Today Hyderabad) ధర కూడా రూ.10,000 తగ్గి రూ.2,50,000కు చేరింది. అంటే బంగారంతో పాటు వెండి ధరలోనూ ఈ వారంలో తగ్గుదల కనిపించింది. అయితే ఇవి బులియన్ మార్కెట్ ధరలు. వీటికి అదనంగా 3 శాతం GST వర్తిస్తుంది. ఆభరణాలు కొనుగోలు చేసే సమయంలో మేకింగ్ ఛార్జీలు, ఇతర వర్తించే ఛార్జీలు కూడా ఉండొచ్చు.

బంగారం ధరలు

24 క్యారెట్ బంగారం – 10 గ్రాములు ₹1,52,680 ₹3,160 తగ్గింది

22 క్యారెట్ బంగారం – 10 గ్రాములు ₹1,39,950 ₹2,900 తగ్గింది

వెండి – కిలో ₹2,50,000 ₹10,000 తగ్గింది

మరిన్ని వార్తలు