శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు
27-09-2026 | 11:09am
మహబూబాబాద్, (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో ప్రాచీన కాలంనాటి సనాతన శివాలయం(Ancient Shiva Temple)లో శివలింగాన్ని ఆదివారం ఉదయం సూర్యకిరణాలు(Sunbeams) తాకాయి. ప్రతి సంవత్సరం దక్షిణాయన పుణ్యకాలం సందర్భంగా సూర్యకిరణాలు శివలింగాన్ని తాకడం జరుగుతుందని గ్రామస్తులు తెలిపారు. కొద్ది నిమిషాల పాటు ఈ అరుదైన దృశ్యాన్ని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై వీక్షించారు.