నా కొడుకు ఆత్మహత్యను రాజకీయం చేయొద్దు

27-09-2026 | 11:19am

మృతుడి రాజేశ్ తల్లి జయమ్మ ఆవేదన

తప్పుడు ప్రచారాలు ఆపాలని  ఆవేదన

ఎల్బీనగర్, సెప్టెంబర్ 26 : వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని.. మన్సూరాబాద్(Mansoorabad) డివిజన్ గణేష్నగర్ ఇటీవల రాజేశ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. అయితే యువకుడి మృతిపై అనుమానాలున్నాయని ఎస్టీ సంఘాల నాయకులు ఆరోపించిన నేపథ్యంలో కొన్ని సోషల్మీడియా వేదికల్లో, యూట్యూబ్ చానల్స్ లో స్థానిక కాంగ్రెస్ ఓ యువనాయకుడి వేధింపుల వల్లే సూసైడ్ చేసుకున్నాడని వార్తలు ట్రోల్స్ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో గణేశనగర్ లో రాష్ట్ర ఎరుకల సంఘం నాయకులు, రాజేశ్ తల్లి కూరాకుల జయమ్మ కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జయమ్మ మాట్లాడుతూ.. 'నా కొడుకు తాగిన మత్తులో సూసైడ్ చే సుకున్నాడా..? ఇంకేదైనా కారణంతో చేసుకున్నాడో నాకే తెలియదని, కానీ ఎవరికీ తోచిన విధంగా వారు నాకొడుకు చావును రాజకీయంగా వా డుకోవద్దు' అంటూ విజ్ఞప్తి చేశారు. నా కొడుకు సూసైడ్కు ఎవరూ కారణం కాదని, చెట్టంతా కొడుకు పోయి కడుపుకోతతో నేనుంటే నాకు ఎవరో కూడా తెలియని గిరిజన సంఘాల నాయకులు రాజకీయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా తప్పుడు ప్రచారాలని ఆపాలని ఎరుకల సంఘం నాయకులు కోరారు. ఈ సమావేశంలో ఎరుకల సంఘం జాతీయ అధ్యక్షుడు కండాల వెంకటే శ్వర్లు, స్థానిక నాయకులు బుడ్డా సత్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు