పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?

27-11-2026 | 10:08am

బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. ఒక్కరోజే భారీ పెరుగుదల!

హైదరాబాద్: పసిడి కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి మరోసారి షాక్ తగిలింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో Gold, Silver Rates మళ్లీ పెరిగాయి. బంగారం ధరలు భారీగా ఎగబాకగా.. వెండి కూడా అదే దారిలో పరుగులు తీసింది. దీంతో ఆభరణాలు కొనాలనుకునే వినియోగదారులపై అదనపు భారం పడనుంది. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.1,750 పెరిగింది. దీంతో గత ధర నుంచి పైకి ఎగబాకి రూ.1,26,550కు చేరుకుంది. మరోవైపు ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాములపై రూ.1,600 పెరగడంతో ప్రస్తుతం రూ.1,16,000 పలుకుతోంది. వరుసగా పెరుగుతున్న Gold Prices పసిడి ప్రియులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా పెరిగింది. కిలో వెండిపై ఏకంగా రూ.5,000 పెరగడంతో హైదరాబాద్ మార్కెట్‌లో కేజీ ధర రూ.1,70,000కు చేరింది. తక్కువ సమయంలోనే Gold and Silver Rates‌లో చోటుచేసుకుంటున్న మార్పులు కొనుగోలుదారుల బడ్జెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. అయితే బంగారం, వెండి ధరలు ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. స్థానిక Bullion Market పరిస్థితులు, వ్యాపారుల ధరల ఆధారంగా రేట్లలో స్వల్ప తేడాలు ఉండొచ్చు. వీటికి అదనంగా కొనుగోలుపై 3 శాతం GST కూడా చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఆభరణాలు కొనుగోలు చేసే ముందు తాజా ధరలతో పాటు GST, Making Charges వివరాలను కూడా తెలుసుకోవడం మంచిది.

మరిన్ని వార్తలు