గోయల్ వ్యాఖ్యలతో ఆశలు

27-11-2026 | 10:31am

భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌పై బిగ్ అప్‌డేట్.. ఫైనల్ దశకు ఒప్పందం!

న్యూఢిల్లీ: భారత్, అమెరికా మధ్య ప్రతిష్ఠాత్మక వాణిజ్య ఒప్పందం(India-US Trade Deal) త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు చర్చల్లో అడ్డంకిగా ఉన్న ప్రక్రియ, ఒప్పందాన్ని ఖరారు చేసే మార్గంపై స్పష్టత వస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. దీంతో రెండు దేశాల మధ్య Trade Dealపై మరోసారి ఆసక్తి పెరిగింది. శుక్రవారం న్యూఢిల్లీలో నిర్వహించిన India Debt Capital Market Summit 2026లో వర్చువల్‌గా పాల్గొన్న పీయూష్ గోయల్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్-అమెరికా Trade Agreement ముగింపు దశకు చేరువవుతోందని ఆయన పేర్కొన్నారు. ఒప్పందాన్ని Finalise చేయడంలో ఇప్పటివరకు ప్రధాన సమస్యగా ఉన్న విధానం, ముందుకు వెళ్లాల్సిన Roadmap ఇప్పుడు ఒక రూపు దాల్చుతున్నాయని తెలిపారు. అయితే ఒప్పందం ఖరారైనట్లు ఆయన ప్రకటించలేదు.

ఇదిలా ఉండగా, అమెరికా తాజా వాణిజ్య ప్రతినిధి (USTR) నివేదికలో భారత దిగుమతులపై 25 శాతం Tariffs విధించే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అయితే భారత్, అమెరికా మధ్య Bilateral Trade Deal కుదిరితే ఈ సుంకాలను 17 శాతానికి పరిమితం చేసే అవకాశం ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ఈ ప్రతిపాదన అమలైతే ఆసియా దేశాల పోటీలో భారత ఎగుమతులకు కొంత అనుకూల పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో ఈ పరిణామాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఒకవైపు Tariff అంశం చర్చనీయాంశంగా ఉండగా, మరోవైపు ఒప్పందం కోసం అవసరమైన ప్రక్రియ ముందుకు సాగుతోందన్న గోయల్ వ్యాఖ్యలు ఆశలు పెంచుతున్నాయి. అయితే తుది ఒప్పందం ఎప్పుడు ఖరారవుతుంది? అందులో ఏయే అంశాలకు చోటు దక్కుతుంది? అన్నది అధికారిక ప్రకటన తర్వాతే స్పష్టత రానుంది.

మరిన్ని వార్తలు