స్వదేశీ పరిజ్ఞానంతో పై సంస్థ ‘పియోక్సాజోన్‌’ విడుదల

31-10-2026 | 09:20pm

హైదరాబాద్‌: భారతదేశంలోనే తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన పురుగుమందు అణువుతో రూపొందించిన పియోక్సాజోన్‌(PioXazone) (పియోక్సానిలిప్రోల్‌ 20% ఎస్సీ)ను పై ఇండస్ట్రీస్‌ నేడు మార్కెట్లోకి విడుదల చేసింది. వరి, మొక్కజొన్న, శనగ పంటల కోసం అభివృద్ధి చేసిన పియోక్సాజోన్‌ శాస్త్రీయ ఆవిష్కరణ నుంచి వాణిజ్యపరమైన వినియోగం వరకు పై  సంస్థ సాగించిన ప్రయాణంలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.

దీని అణువు, పియోక్సానిలిప్రోల్‌ భారత వ్యవసాయ ఆవిష్కరణల ప్రయాణంలో ఒక కీలక ఘట్టంగా నిలుస్తోంది. ఇండియా ఇప్పుడు తమ సొంత పంట సంరక్షణ ఆవిష్కరణలు చేయడంతో పాటుగా వాటిని అభివృద్ధి చేయడం, అనుమతులు పొందడం, వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురావడం వంటివి చేయగలదని ఇది నిరూపిస్తోంది. ఈ పూర్తి ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసిన తొలి ఉత్పత్తి పియోక్సాజోన్‌®.

భారతీయ వ్యవసాయ రంగంలో వరి, మొక్కజొన్న, శనగ అత్యంత ముఖ్యమైన పంటలు. దక్షిణ భారతదేశంలో వ్యవసాయానికి ఇవి వెన్నెముకగా నిలుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ను ‘భారతదేశపు వరి ధాన్యాగారం’గా పరిగణిస్తారు. దేశంలోనే అతిపెద్ద మొక్కజొన్న ఉత్పత్తి రాష్ట్రంగా, కర్ణాటక నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో పండించే పప్పుధాన్యాల్లో శనగ ప్రధాన పంటగా ఉంది. ఈ ప్రాంతంలోని లక్షలాది రైతు కుటుంబాలకు ఈ పంటలను కాపాడుకోవటమంటే వారి జీవనోపాధిని కాపాడుకోవడమే.

భారత వ్యవసాయ రంగంతో పై సంస్థకు ఉన్న ఎనిమిది దశాబ్దాల అనుబంధం, అనుభవంతో వివిధ పంటల సాగు పరిస్థితులకు అనుగుణంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పియోక్సాజోన్‌ను  క్షేత్రస్థాయిలో పరీక్షించారు. వరి పంటలో పసుపు కాండం తొలిచే పురుగు, మొక్కజొన్నలో లద్దె పురుగు, శనగలో కాయ తొలిచే పురుగు నియంత్రణ కోసం వినియోగించేందుకు అనువుగా ఉంటుందని సెంట్రల్‌ ఇన్‌సెక్టిసైడ్స్‌ బోర్డు అండ్‌ రిజిస్ట్రేషన్‌ కమిటీ (సీఐబీ అండ్‌ ఆర్‌సీ) అనుమతులు మంజూరు చేసింది.

ఈ ఉత్పత్తి విడుదల సందర్భంగా పై ఇండస్ట్రీస్‌ వైస్‌ చైర్‌పర్సన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ మయాంక్‌ సింఘాల్‌ మాట్లాడుతూ “ పై యొక్క  ఆవిష్కరణల ప్రయాణంలో ఒక కీలక మైలురాయిగా పియోక్సాజోన్‌® నిలుస్తోంది. పియోక్సానిలిప్రోల్‌ ద్వారా సొంత శాస్త్రీయ ఆవిష్కరణలు చేయడంతో పాటు, వాటిని అభివృద్ధి చేయడం, అనుమతులు పొందడం వరకు పూర్తి ఆవిష్కరణ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయగల సామర్థ్యం మాకు ఉందని నిరూపించాం. పియోక్సాజోన్‌® రైతులకు అందుబాటులోకి వస్తుండటంతో, భారతదేశంలోని విభిన్న వ్యవసాయ పరిస్థితులపై లోతైన అవగాహనతో స్వదేశీ ఆవిష్కరణను పరిశోధన స్థాయి నుంచి క్షేత్రస్థాయికి తీసుకెళ్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు