కేజీబీవీ హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన తహసీల్దార్
31-10-2026 | 10:09pm
అలంపూర్: మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (Kasturba Gandhi Balika Vidyalaya) హాస్టల్‌ను తహసీల్దార్ మన్సూర్ అలీ సిద్ధిఖీ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, సిబ్బందితో మాట్లాడి వారికి అందుతున్న వసతులు, సంక్షేమం, విద్యా పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తరగతి గదులు, వంటగది, భోజనశాల, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన వసతులు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో మంచి బోధన అందించాలని అక్కడి సిబ్బందికి సూచించారు.