గాయపడిన డాన్స్ మాస్టర్‌కు ఆర్థిక సాయం

31-10-2026 | 10:14pm

మిడ్జిల్: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ప్రముఖ డాన్స్ మాస్టర్ ఏదుల శేఖర్‌(Dance Master Edula Shekhar)కు మిడ్జిల్ మండలం రాణిపేట సెయింట్ మేరీస్ పాఠశాల యాజమాన్యం రూ.12,600 ఆర్థిక సాయం అందించింది. పాఠశాల కరస్పాండెంట్ జోసెఫ్ బెర్కమాన్ ఆధ్వర్యంలో ప్రతినిధులు, విద్యార్థులు శేఖర్‌ను పరామర్శించి వైద్య ఖర్చుల కోసం నగదు అందజేశారు. నిరుపేద పిల్లలకు ఉచితంగా నృత్య శిక్షణ అందిస్తూ కళారంగానికి సేవలందిస్తున్న శేఖర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రతాప్, అమీర్, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు