పుతిన్ పార్టీ ఘన విజయం

22-09-2026 | 05:05am
  1. దిగువ సభ స్టేట్ డూమాలో యునైటెడ్ రష్యా విక్టరీ
  2. ఎన్నికల్లో 450 స్థానాలకు 355 చోట్ల గెలుపు
  3.   58 శాతం ఓట్లు వచ్చాయన్న కేంద్ర ఎన్నికల సంఘం 
  4. కమ్యునిస్ట్ ఆఫ్ రష్యా పార్టీకి 40 సీట్లు
  5. మరో 225 మంది సభ్యులను ఏక-బ్యాలెట్ ద్వారా ఎన్నిక

మాస్కో, సెప్టెంబర్ 21: ఎన్నికల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Russian President Vladimir Putin) పార్టీ ఘనవిజ యం సాధించింది. పార్లమెంటు దిగువ సభ స్టేట్ డూమాలో ఆయన అనుకూలమైన యునైటెడ్ రష్యా పార్టీ(United Russia Party) భారీ మెజారిటీతో గెలిచింది. మూడు రోజుల పాటు జరిగిన ఎన్నిక(Election)ల్లో 450 స్థానాల్లో 355 స్థానాలను కైవసం చేసుకుంది. పార్టీలకు కేటాయించిన 225 సీట్లలో యునైటెడ్ స్టేట్స్‌కు సుమారు 58 శాతం ఓట్లు వచ్చినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఏక- నియోజకవర్గాలు 225 సీట్లలో 208 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు అధికారంలో ఉన్నారు.

95 శాతానికి పైగా పోలింగ్ కేంద్రాల ఫలితాల ప్రకారం.. పార్టీలకు కేటాయించిన 225 సీట్లలో యునైటెడ్ రష్యా పార్టీకి దాదాపు 58 శాతం ఓట్లు లభించాయని ఎన్నికల కమిషన్ ఛైర్ ఎల్లా పాంఫిలోవా తెలిపారు. మరో 225 మంది చట్టసభ సభ్యులను ఏక-బ్యాలెట్ ఎన్నికలలో ఎన్నుకున్నారు. ఆ ఎన్నికలలో 208 స్థానాలలో యునైటెడ్ రష్యా అభ్యర్థులు ఆధిక్యం లో ఉన్నట్లు సమాచారం. 2022లో ఉక్రెయిన్‌పై రష్యా పూర్తిస్థాయి దాడి ప్రారంభించిన తర్వాత జరిగిన తొలి పార్లమెంటరీ ఎన్నికలు ఇవి.

రష్యా ఆక్రమించిన ఉక్రెయిన్ ప్రాంతాలనూ, క్రిమియాలోనూ ఓటింగ్ నిర్వహించ డాన్ని ఉక్రెయిన్ చట్టవిరుద్ధంగా అభివర్ణించింది. ఎన్నికలకు ముందు ప్రతిపక్షంపై ప్రభుత్వం ఆంక్షలు పెంచిందని విమర్శలు వచ్చాయి. రష్యా ఏకైక ఉదారవాద, యుద్ధ వ్యతిరేక పార్టీని బ్యాలెట్ నుంచి నిషేధించడంతోపాటు ఎలక్ట్రానిక్ ఓటింగ్‌పై కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే ఎన్నికల సంఘం ప్రకారం.. పోలింగ్ శాతం 59కి పైగా నమోదైంది. రష్యా దిగువ సభలో మొ త్తం 450 సీట్లు ఉంటాయి.

వీటిలోని సగం సీట్లల్లో పార్టీలు అభ్యర్థులను పోటీలోకి దింపుతాయి. మిగిలిన సగం సీట్లలో (పార్టీ లిస్టు) ప్రజలు నేరుగా పార్టీలనే ఎంచుకుంటారు. పార్టీలకు వచ్చిన ఓట్ల ఆధారంగా సీ ట్ల కేటాయింపు ఉంటుంది. 5 శాతానికి ది గువ ఓట్లు సాధించిన పార్టీలకు ఎలాంటి సీ ట్ల కేటాయింపు ఉండదు.

రష్యా మీడియా కథనాల ప్రకారం, ఇప్పటివరకూ 90 శాతం ఓట్ల కౌంటింగ్ పూర్తుంది. డుమాలోని మొ త్తం సీట్లలో యునైటెడ్ రష్యా పార్టీకి 355 సీట్లు లభించగా కమ్యునిస్ట్ పార్టీ ఆఫ్ రష్యా కు 40 సీట్లు లభించాయి. లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి 25 సీట్లు, న్యూపీపుల్ పార్టీకి 20 సీట్లు దక్కాయి. ఈ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రజల మద్దతు పుతిన్‌కు దక్కిందని అధికార పార్టీ ఘనంగా ప్రకటించింది.

మరిన్ని వార్తలు