QR Code అసలు కథ ఇదే!

25-09-2026 | 02:30pm

రెస్టారెంట్ బిల్లు నుంచి UPI పేమెంట్ వరకు.. ఇప్పుడు QR Code మన రోజువారీ జీవితంలో భాగమైపోయింది. ఫోన్‌తో ఒక్కసారి స్కాన్ చేస్తే చాలు.. చెల్లింపుల నుంచి టికెట్ల వరకు ఎన్నో పనులు క్షణాల్లో పూర్తవుతున్నాయి. కానీ మనం ప్రతిరోజూ చూస్తున్న ఈ చిన్న చతురస్రం మొదట డిజిటల్ పేమెంట్స్ కోసం తయారైందని అనుకుంటే మాత్రం పొరపాటే! QR Code అసలు కథ జపాన్‌లోని కార్ల తయారీ పరిశ్రమతో ముడిపడి ఉంది. 1994లో(QR Code 1994) DENSO WAVE దీన్ని అభివృద్ధి చేసింది. కార్ల ఫ్యాక్టరీల్లో వేలాది విడిభాగాలను వేగంగా గుర్తించేందుకు అప్పటి బార్‌కోడ్‌లకు ప్రత్యామ్నాయంగా ఈ టెక్నాలజీ రూపొందింది.

QR Code ప్రత్యేకత(QR Code History) ఏంటంటే.. సాధారణ బార్‌కోడ్‌ల కంటే ఎక్కువ సమాచారాన్ని నిల్వ చేయడంతో పాటు వివిధ దిశల నుంచి కూడా వేగంగా స్కాన్ చేయగలిగేలా డిజైన్ చేశారు. కోడ్ మూలల్లో కనిపించే మూడు పెద్ద చతురస్రాలు కూడా అందుకే కీలకం.. స్కానర్‌కు కోడ్ దిశను గుర్తించడంలో అవి సహాయపడతాయి. అక్కడితో కథ ఆగలేదు. ఈ టెక్నాలజీ క్రమంగా ఫ్యాక్టరీల నుంచి బయటకు వచ్చి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. నేడు షాపింగ్, రెస్టారెంట్లు, టికెట్లు, డిజిటల్ పేమెంట్లు ఇలా ఎన్నో రంగాల్లో QR Code మనకు కనిపిస్తోంది. అంటే.. మనం ప్రతిరోజూ స్కాన్ చేస్తున్న ఆ చిన్న బాక్స్ వెనుక ఉన్న అసలు కథ మాత్రం కార్ల ఫ్యాక్టరీలో మొదలైందన్నమాట!

మరిన్ని వార్తలు