Samsung Galaxy A08 లాంచ్.. ధర ఎంతంటే?
న్యూఢిల్లీ: ప్రముఖ టెక్ సంస్థ శాంసంగ్ భారత్‌లో కొత్త శాంసంగ్ గెలాక్సీ ఏ08 4జీ (Samsung Galaxy A08 4G) స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. స్మార్ట్‌ఫోన్ కోరుకునే వారి కోసం ఏ సిరీస్‌లోలో ఏటా కొత్త ఫోన్లను లాంచ్ చేస్తున్న శాంసంగ్ ఈ ఫోన్లో ఏ07కు కొనసాగింపుగా దీన్ని తీసుకొచ్చింది. 6,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 50ఎంపీ కెమెరా, 90Hz డిస్ప్లే వంటి ఫీచర్లను అందించింది. 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్లో లభించే గెలాక్సీ ఏ08 ధరను కంపెనీ రూ.18,499గా నిర్ణయించింది.
భారత్ లో శాంసంగ్ గెలాక్సీ ఏ08 ధర ప్రకారం... డార్క్ బ్లూ, గ్రీన్, సిల్వర్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు, అధికారిక వెబ్సైట్, ఇతర ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ మోడల్ 4G కనెక్టివిటీకి మాత్రమే సపోర్ట్ చేస్తుంది.
ఆరు ఏళ్ల అప్డేట్స్
గెలాక్సీ ఏ08లో శాంసంగ్ దీర్ఘకాలిక సాఫ్ట్వేర్ సపోర్ట్‌ను అందిస్తోంది. ఆరు తరాల ఓఎస్ అప్‌గ్రేడ్స్, ఆరు సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని కంపెనీ ప్రకటించింది. దీంతో దీర్ఘకాలం ఫోన్‌ను ఉపయోగించాలనుకునే వారికి సాఫ్ట్వేర్ సపోర్ట్ కూడా ఈ మోడల్లోని ప్రధాన ఫీచర్లలో ఒకటిగా నిలుస్తోంది.
ఫీచర్లు ఇవే..
6.7 అంగుళాల హెచ్ఎ+ పీఎల్ఎస్ ఎల్సీడీ ప్యానెల్
90Hz రిఫ్రెష్ రేటు
మీడియాటెక్ హీలియో జీ99+ ప్రాసెసర్
మైక్రో ఎస్ఓ కార్డు ద్వారా 2టీబీ వరకు స్టోరేజీ పెంచుకునే వీలు
శాంసంగ్ నాక్స్ సెక్యూరిటీ
50 ఎంపీ కెమెరా, 2 ఎంపీ డెప్త్ సెన్సర్
8 ఎంపీ ఫ్రంట్ కెమెరా
25W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం
ముందువైపు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
ఐపీ64 డస్ట్, స్ప్లాష్ రేటింగ్