బ్యాటరీ రక్షణకు ప్రత్యేక బీమా కవర్

31-10-2026 | 09:22pm

ముంబై: తాజా రిజిస్ట్రేషన్ గణాంకాల ప్రకారం ఇటీవలి కాలంలో ఈవీల మార్కెట్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నట్లుగా తెలుస్తున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల యజమానులు తమ వాహన బీమాను సమీక్షించుకోవాలంటూ భారతదేశపు అగ్రగామి జనరల్ ఇన్సూరెన్స్ సంస్థల్లో ఒకటైన టాటా ఏఐజీ(Tata AIG) జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (టాటా ఏఐజీ) పిలుపునిచ్చింది.

వాహన్ రిజిస్ట్రేషన్ డేటా ప్రకారం 2026 జనవరి మరియు సెప్టెంబర్ మధ్య కాలంలో భారత్‌లో 25.37 లక్షల ఈవీలు రిజిస్టరయ్యాయి. గతేడాది ఇదే వ్యవధిలో రిజిస్టరైన 16.70 లక్షలతో పోలిస్తే ఇది 51.9 శాతం అధికం. 2025 మొత్తం మీద 23,56,971 ఈవీలు రిజిస్టర్ కాగా 2026లో కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే అంతకు మించి రిజిస్ట్రేషన్లు జరిగాయి. వృద్ధి కూడా వేగవంతమైంది. 2024లో వృద్ధి 28 శాతంగా ఉండగా, 2025లో 16.3 శాతంగా నమోదైంది.

ఈ వ్యవధిలో నమోదైన మొత్తం కొత్త వాహన రిజిస్ట్రేషన్లలో ఈవీల వాటా 10.7 శాతానికి చేరింది. అంతకు ముందు ఏడాది ఇది 8.6 శాతంగా నమోదైంది. 2026లో ప్రతి నెలలోనూ 2025తో పోలిస్తే వృద్ధి నమోదవుతూనే ఉంది. దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతుండటంతో, వాటికి సంబంధించిన ఇన్సూరెన్స్ అవసరాలు కూడా మారుతున్నాయి.

సంప్రదాయ ఇంధన వాహనాలతో పోలిస్తే ఈవీలకు బ్యాటరీ దెబ్బతినడం, ప్రత్యేక మరమ్మతు అవసరాలు మరియు ఛార్జింగ్ సంబంధిత ప్రమాదాల రూపంలో భిన్నమైన రిస్కులు ఉంటాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు తమ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలు ఈ ప్రమాదాలను ఏ విధంగా కవర్ చేస్తున్నాయనే దానిపై అవగాహన కలిగి ఉండటం ఎంతో కీలకమని నిపుణులు పేర్కొంటున్నారు.

"భారతదేశంలో ఈవీ ప్రస్థానం ప్రారంభ దశ దాటి ప్రస్తుతం ప్రధాన స్రవంతిలోకి చేరింది. దీనితో వాహన యజమానులు తమ వాహన రక్షణ గురించి ఆలోచించే విధానం మారుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల యొక్క రిస్క్ ప్రొఫైల్, సంప్రదాయ వాహనాలకి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇందులో బ్యాటరీ అత్యంత విలువైన భాగం కాగా, మరమ్మతులకు ప్రత్యేక నైపుణ్యం అవసరమవుతుంది. పైగా ఇల్లు మరియు రహదారులపై ఛార్జింగ్ చేయడం ద్వారా కొత్త రకాల ప్రమాదాలకు అవకాశం ఉంటుంది" అని టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, మోటార్ అండర్‌రైటింగ్ హెడ్ ఎ. కిరణ్ కుమార్ తెలిపారు.

ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు అడుగులు వేస్తున్న వినియోగదారులు సరైన అవగాహనతో కూడిన మోటార్ ఇన్సూరెన్స్ ఎంపికలను చేసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలని టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ సూచిస్తోంది. ఈవీ యజమానులు తమ పాలసీల పరిధిని క్షుణ్ణంగా పరిశీలించాలి. ముఖ్యంగా బ్యాటరీ సంబంధిత నష్టాలకు లభించే కవరేజీ, ఛార్జింగ్ పరికరాల రక్షణ, ప్రమాదవశాత్తు జరిగే నష్టాలు మరియు ఎలక్ట్రిక్ సర్జ్ సెక్యూర్ కవర్, బ్యాటరీ కన్వీనియన్స్ కవర్, వాల్ ఛార్జర్ ప్రొటెక్షన్ కవర్ వంటి యాడ్-ఆన్ ప్రొటెక్షన్లను సరిగ్గా అంచనా వేసుకోవాలి.

మరిన్ని వార్తలు