షూ ఫ్యాక్టరీలో అగ్నికీలలు
ఢిల్లీ షూ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. నలుగురు మృతి!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వాయవ్య ఢిల్లీలోని మంగోల్పురి ఇండస్ట్రియల్ ఏరియా ఫేజ్-1లో(Mangolpuri Industrial Area) ఉన్న ఓ షూ ఫ్యాక్టరీలో శుక్రవారం రాత్రి భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. దీంతో Industrial Areaలో తీవ్ర కలకలం రేగింది. శుక్రవారం రాత్రి 9.32 గంటలకు అగ్నిప్రమాదంపై సమాచారం అందడంతో Delhi Fire Service వెంటనే స్పందించింది.
సుమారు 20 ఫైర్ ఇంజిన్లను ఘటనాస్థలికి పంపించి Fire Fighting Operation చేపట్టారు. ఫ్యాక్టరీలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ఫ్యాక్టరీలో అపస్మారక స్థితిలో ఉన్న ఆరుగురిని Rescue Team సురక్షితంగా బయటకు తీసుకొచ్చి సంజయ్ గాంధీ మెమోరియల్ ఆసుపత్రికి తరలించింది. అయితే వారిలో నలుగురు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మరో ఇద్దరికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.