గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల సేకరణ
వ్యభిచారం నిర్వహణ
బేగంపేటలో ముఠా గుట్టు రట్టు
సికింద్రాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): హైదరాబాద్ బేగంపేటలో అండాల అక్రమ సేకరణ చేపడుతూ, వ్యభిచారం నిర్వహిస్తున్న స్థావరంపై బేగంపేట ఎస్‌వోటీ పోలీసులు దాడి చేసి.. ముఠా గుట్టు రట్టు చేశారు. ఇక్కడి ప్రకాష్‌నగర్‌లోని నజ్రాన్ అపార్ట్‌మెంట్‌లో గర్ల్స్ హాస్టల్ పేరుతో ఏడా దికాలంగా యువతుల నుంచి అండాలు, పురుషుల నుంచి వీర్యకణాలు అక్రమంగా సేకరించి విక్రయిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బీ సుమతి(Police Commissioner B. Sumati) ఆదేశాల మేరకు ఎస్‌వోటీ పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు.
సంతాన సాఫల్య కేంద్రాల (ఫెర్టిలిటీ సెంటర్లు) కోసం యువతుల నుంచి అక్రమంగా అండాలను సేకరిస్తున్నట్లు, వ్యభిచారం కూడా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందినవారు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అండాల సేకరణ, సర ఫరా వెనుక ఉన్న ప్రధాన నెట్‌వర్క్.. దీనితో సంబంధం ఉన్న సంతాన సాఫ ల్య కేంద్రంలోని మహిళలు, పురుషులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.