బీఆర్‌ఎస్ చెర నుంచి భూములకు విముక్తి

31-10-2026 | 05:10am
  1. మియాపూర్‌లో 550 ఎకరాలను కొట్టేసేందుకు కేసీఆర్, ఆయన బంధువుల ప్లాన్
  2. సుప్రీంకోర్టులో పోరాడి కాపాడాం: సీఎం రేవంత్‌రెడ్డి
  3. ఆ భూములను విక్రయించి నీటిపారుదల, విద్య, వైద్యానికి ఖర్చు
  4. బీఆర్‌ఎస్ భూ దందాపై చర్చించేందుకు అసెంబ్లీకి కేసీఆర్ రావాలి 
  5. మూడేండ్లలో రూ. 1.50 లక్షల కోట్ల విలువైన భూములను కాపాడాం
  6. భూ కబ్జాకు యత్నిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిక

హైదరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్(BRS) పదేండ్ల పాలనలో కొందరు అధికారులను అడ్డంపెట్టుకుని భూములు కొట్టేయాలని ఆ పార్టీ నేతలు చూశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గత బీఆర్‌ఎస్ హయాంలో కబ్జాలకు గురైన భూములను మా ప్రభుత్వం కాపాడుతున్నది. మియాపూర్‌లోని 550 ఎకరాల భూములను కొల్లగొట్టేందుకు కేసీఆర్, ఆయన బంధువులు అనేక రకాలుగా ప్రయత్నించారు. వాటి విలువ రూ. 50 వేల కోట్లు ఉంటుంది’ అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక  రూ.1.50 లక్షల కోట్ల విలు వైన భూములను రక్షించామన్నారు. శుక్రవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

‘మియాపూర్‌లోని ని 550 ఎకరాలను కాపాడేందుకు గత సర్కార్ ఎలాంటి ప్రయత్నం చేయలేదు. మేం అధికారంలోకి వచ్చాక ఈ కేసుపై ప్రత్యేకంగా దృష్టి సారించి, సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించి రూ.50 వేల కోట్ల విలువ చేసే ఆస్తిని కాపాడుకోగలి గాం. సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఈ భూము లు స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించాం. అవసరమైతే ఈ భూములను వేలం వేసి దళిత, బహుజనుల కోసం ఖర్చు చేస్తాం’ అని ప్రకటించారు. ఆ భూములను విక్రయించి నీటిపారుదల, విద్యా, వైద్యం వం టి తదితర రంగాలకు కేటాయిస్తామన్నారు. ఈ అంశంపై క్యాబినెట్‌లో చర్చిస్తామని ఆయ న తెలిపారు. 

కోర్టులకు వెళ్లి కాపాడాం

‘బీఆర్‌ఎస్ నాయకులు కంచె గచ్చిబౌలి, మామిడిపల్లి భూములను కొట్టేసేందుకు ప్ర యత్నిస్తే న్యాయ పోరాటంలో గెలిచాం. మా ప్రభుత్వం వచ్చిన మూడేండ్లలో రూ. 1.50 లక్ష కోట్ల విలువైన భూములను రక్షించాం. ఐఎంజీ భూములను భలేరావు కుటుంబ సభ్యులతో కుమ్మక్కై కేటీఆర్ కొట్టేయాలని చూస్తే న్యాయపోరాటంతో అడ్డుకున్నాం. గు ర్రంగూడ అటవీ భూములను కేటీఆర్ అనుచరులు కబ్జాకు ప్రయత్నిస్తే సుప్రీంకోర్టులో పోరాడాం. ప్రభుత్వం పోరాటంతో అది అట వీ భూమి అని సుప్రీంకోర్టు తెల్చి చెప్పింది. మంచిరేవులలో 143 ఎకరాల భూమిని కేటీఆర్ రాయలసీమ బిల్డర్స్‌తో కలిసి కబ్జాకు ప్ర యత్నిస్తే దానినీ రక్షించాం. అందులో పోలీసుల పిల్లల కోసం స్కూల్ పెట్టాం.

జయ శంకర్ భూపాలపల్లి జిల్లాలో 400 ఎకరాల అటవీ భూమిని బీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేకు నజరానాగా అప్పగిస్తే సుప్రీంకోర్టులో పోరాడి రక్షించాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ ఎస్ నాయకుల భూ ఆక్రమణలను అడ్డుకున్నాం’ అని ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డి తెలిపారు.  వనరుల సమీకరణకు నియమించిన మంత్రివర్గ ఉప సంఘం ఈ భూము ల విక్రయంపై చర్చించి.. వచ్చే ఆ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులపై అధ్యయనం చేస్తుందన్నారు. ఎల్బీనగర్ నియోజక వర్గంలోని హ యత్‌నగరలో ఉన్న  150 ఎకరాలను కా పాడి అటవీ ప్రాంతంగా మార్చామని ఆయన తెలిపారు. 

సర్వే చేయకుండా అడ్డుకుంటున్నారు

‘మాజీ మంత్రి హరీశ్ రావు మామ హనుమంతరావు కబ్జా పెట్టిన భూములను అధికా రులు సర్వే చేయకుండా అడ్డుకుంటున్నారు. పైగా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. భూము ల ఆక్రమణపై బీఆర్‌ఎస్ నాయకులు ప్రభుత్వంపై అనేక తప్పుడు ఆరోపణలు చేశారు. శాసనసభలో చర్చ పెట్టి చర్యలకు దిగితే తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారు’ అని సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మియాపూర్ భూములపై ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే ఎందుకు బీఆర్‌ఎస్ నాయకులు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.

కనీసం రెవెన్యూ అధికారులను బీఆర్‌ఎస్ నాయకులు ఎందుకు అభినందించడం లేదన్నారు. ‘ఉమ్మడి రాష్ట్రంలో పద్మాల య స్టూడియో, ల్యాంకో భూములపై కేసులు వేసిన కేసీఆర్, హరీశ్ రావు బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు వాటిని స్వాధీనం చేసుకోలేదు? అధికారంలోకి వచ్చి న తర్వాత ఎవరిపై కేసులు వేశారో వారితోనే కేసీఆర్, హరీశ్ రావు లాలూచీ పడ్డారు. రెండు గ్రామాల మధ్య వివాదాన్ని కేసీఆర్ తనకు అనుకూలంగా మలచుకున్నారు. అక్కడి ఆక్రమణలను తేల్చి శ్రీకాంతాచారి అమరవీరుల కాలనీ నిర్మిస్తాం. కేసీఆర్, కేటీఆర్ ఇప్పటికైనా బుద్ది మార్చుకొని.. ఆక్రమణలు చేయడం మానుకోవాలి. వాళ్ల ఆక్రమణలకు వ్యతిరేకంగా కోర్టులు తీర్పులు ఇస్తున్నాయి’ అని సీఎం తెలిపారు. 

కబ్జా చేస్తే కఠిన చర్యలు

మియాపూర్ భూములపై ఇప్పటికైనా బీఆర్‌ఎస్ నేతలు కుట్రలు మానుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.  తెలంగాణలో అత్యంత విలువైన ప్రభుత్వ భూములున్నాయో వాటిని తన కుటుంబ సభ్యులు, అనుచరుల మీదికి బదిలీ చేసి కొట్టేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కేసీఆర్, కుటుంబ సభ్యులు, బీఆర్‌ఎస్ నాయకులు విలువైన భూములు కబ్జాకు ప్రయత్నించారు. నేను ఎమ్మెల్యేగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భూ కబ్జా వ్యవహారాలపై పోరాడితే కక్ష గట్టి జైలుకు పంపా రు’ అని సీఎం తెలిపారు. భూ కబ్జాకు యత్ని స్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. ఈ భూములపై సుప్రీంకోర్టు తీర్పునకు  ధన్యవాదాలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు