కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్ధీకరించాలి

31-10-2026 | 05:35am
  1. ఉద్యోగ భద్రత కల్పించి, వేతనాలు పెంచాలి
  2. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య
  3. శాశ్వత నియామకాలు చేపట్టాలి
  4. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు

ముషీరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి, వారి సేవలను క్రమబద్ధీకరించాలని జాతీయ బీసీ సంక్షేమ సం ఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య(MP R. Krishnaiah) డిమాండ్ చేశారు.

కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు వారి దీర్ఘకాలిక సేవలను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో వర్సిటీ టీచర్స్ అసోసియేషన్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పరశురాం అధ్యక్షతన 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను విలీనం,  క్రమబద్ధీకరణ చేయాలని, చేసే వరకు ఉద్యోగ భద్రతతో కూడిన 7 వ పీఆ ర్సీ, యూజీసీ స్కెల్స్ అమలు చేసిన తరువా తనే నియామకాలు చేపట్టాలని అనే అంశంపై అఖిలపక్ష సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి సైతం కాంట్రాక్ట్ అధ్యాపకుల డిమాండ్లు న్యాయమైనవేనని పేర్కొన్నారని గుర్తుచేశారు. ఇప్పుడు ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తే అసెంబ్లీలో ప్రత్యేక చట్టం తీసుకొచ్చి సమస్యను పరిష్కరించవచ్చన్నారు. యూజీసీ నిబంధనలను పరిశీలించడంతోపాటు ఇతర రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలను ఎలా పరిష్కరించారో అధ్యయనం చేయాలని సూచించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు మాట్లాడుతూ కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యలను పరిష్కరించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. తెలంగాణ విద్యావ్యవస్థ అభివృద్ధి చెందాలంటే ఉన్నత విద్యకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు శాశ్వత అధ్యాపకుల నియామకాలు చేపట్టాలని సూచించారు.  సమావేశంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్, కాంగ్రెస్ అధికార  ఇందిరా శోభన్, వర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (కాంట్రాక్ట్) వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ధర్మతేజ, డాక్టర్ కరుణాకర్‌రావు, డాక్టర్ భూమయ్య, డాక్టర్ శ్యాంసుందర్, డాక్టర్ సురేష్, డాక్టర్ రామకృష్ణయ్య, డాక్టర్ విజయేందర్‌రెడ్డి, డాక్టర్ శ్రీశైలం, డాక్టర్ రవి, డాక్టర్ తిరుపతి, డాక్టర్ సీహెచ్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు