సడన్‌ బ్రేక్‌.. నాలుగు కార్లు ఢీ

10-10-2026 | 11:57am

అలంపూర్, అక్టోబర్ 10 (విజయ క్రాంతి): హైదరాబాద్‌–కర్నూలు జాతీయ రహదారిపై పుల్లూరు టోల్‌ప్లాజా సమీపంలో శనివారం వరుస రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న కారు ఒక్కసారిగా సడన్ బ్రేక్ (Sudden Brake) వేయడంతో వెనుక నుంచి వస్తున్న మరో మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి.

ఈ ఘటనలో నాలుగు కార్లు దెబ్బతిన్నాయి. అయితే, పెను ప్రమాదం తప్పడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊరట చెందారు. ప్రమాదం కారణంగా కొద్దిసేపు జాతీయ రహదారిపై ట్రాఫిక్ (Traffic) అంతరాయం ఏర్పడింది. వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో రహదారిపై రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, వేగ నియంత్రణ (Speed Control) పాటిస్తూ ప్రయాణించాలని సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు