రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి
నర్సాపూర్, నవంబర్ 23 (విజయక్రాంతి): గుర్తుతెలియని వాహనం (Unknown Vehicle) ఢీకొని 64 ఏళ్ల వృద్ధుడు మృతి చెందిన ఘటన నర్సాపూర్ పట్టణంలోని ఎన్‌హెచ్–765డీ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పట్టణంలోని శివాలయం వీధికి చెందిన వడ్డె ఎల్లయ్య (64) ఆదివారం రాత్రి సుమారు 11 గంటలకు టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై సిగరెట్ కొనుగోలు చేసేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.
సోమవారం తెల్లవారుజామున 2.45 గంటల సమయంలో బాలాజీ ఫుట్‌వేర్ షాపు ఎదుట మెదక్ వైపు వెళ్లే మార్గంలో ఆయన ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎల్లయ్యను పోలీసులు (Police) నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ప్రమాదానికి కారణమైన వాహనం ఆగకుండా వెళ్లిపోయింది. మృతుడి కుమారుడు అంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఎ. రంజిత్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు (Investigation) చేస్తున్నారు. సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తూ ప్రమాదానికి కారణమైన వాహనం, డ్రైవర్‌ను గుర్తించేందుకు తనిఖీలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.