నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కారుకు ప్రమాదం

18-09-2026 | 09:10am

బోధన్, సెప్టెంబర్, 18 (విజయక్రాంతి): నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్(Nizamabad MP Arvind) ప్రయాణిస్తున్న వాహనానికి శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్ పోలీస్ స్టేషన్(Medchal Police Station) పరిధిలోని రేకబావుల సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌కు(Nizamabad to Hyderabad) ఎంపీ అర్వింద్ వాహనంలో వెళ్తుండగా, రేకబావుల వద్దకు చేరుకున్న సమయంలో ఎర్టీగా కారు ఆయన వాహనాన్ని ఢీకొట్టినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే ఎంపీ గన్‌మెన్లు స్పందించి ఎర్టిగా కారులో ఉన్న వారితో మాట్లాడటంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో వాహనాలకు జరిగిన నష్టాన్ని పరిశీలించడంతో పాటు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. డ్రైవర్లను వివరాలు అడిగి తెలుసుకుంటున్న పోలీసులు, ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు