రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం.. సిద్దిపేటకు కాంగ్రెస్ నేతలు

18-09-2026 | 07:42am

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) కుటుంబం భూములను ఆక్రమించుకున్నట్లు తెలంగాణ అసెంబ్లీలో(Telangana Assembly) సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు అసెంబ్లీలో అందుబాటులో ఉండాలని సూచించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ఎంపీలు, ఎమ్మెల్సీలను సిద్దిపేటకు పంపేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సిద్దిపేటలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములు పరిశీలించేలా రేవంత్ ప్రణాళిక చేయనున్నారు. సీఎంతో భేటీ తర్వాత సిద్దిపేట పర్యటనపై స్పష్టత వచ్చే అవకాశముంది. 22ఏ భూములపై(22-A lands) పక్కా వ్యూహంతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ప్రతిపక్షాల విమర్శలకు దీటుగా ఎదుర్కునేలా ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. అధికార ప్రతినిధులకు అవగాహన కల్పించేలా ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. అన్ని విషయాలను గడపగడపకు తీసుకెళ్లేలా ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది.

మరిన్ని వార్తలు