బైకు అదుపు తప్పి వ్యక్తి మృతి

17-10-2026 | 04:33pm

కొండపాక,(విజయక్రాంతి): కొండపాక మండలం(Kondapaka mandal) మర్పడగ గ్రామ శివారులో ద్విచక్ర వాహనం అదుపు తప్పి మహమ్మద్ యూసుఫ్ షరీఫ్(Mohammed Yusuf Sharif) మృతి చెందాడు. త్రీటౌన్ సిఐ లక్ష్మీ బాబు(Three-Town CI Lakshmi Babu) తెలిపిన వివరాల మేరకు సిద్దిపేటలో ఆర్టీఏ ఏజెంట్‌గా పనిచేస్తున్న మొహమ్మద్ యూసుఫ్ షరీఫ్ శుక్రవారం రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. శనివారం ఉదయం గ్రామానికి చెందిన దూడెం కృష్ణ సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తన భర్త మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని,భార్య షాహిన్ బేగం  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు