భీమ్ విగ్రహావిష్కరణ విజయవంతం చేయాలి
ఉట్నూర్, అక్టోబర్ 17 ( విజయక్రాంతి ): ఈనెల 23వ తేదీన పోరాట గడ్డ ఇంద్రవెల్లి మండల(Indravelly Mandal) కేంద్రంలో పోరాట వీరుడు కొమరం భీమ్(Komaram Bheem) విగ్రహావిష్కరణను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bojju Patel) అన్నారు. శనివారం ఉట్నూర్(Utnoor) లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాయి సెంటర్ల సార్ మేడిల తో కలిసి భీమ్ విగ్రహావిష్కరణ పోస్టర్లను విడుదల చేశారు.
ఈ సందర్భంగా సార్ మేడిలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శాంతియుతంగా ఆదివాసుల వాయిద్యాలయం డోలు తుడుము వాయిస్తూ.. విగ్రహావిష్కరణను ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయంగా నిర్వహించాలన్నారు. విగ్రహావిష్కరణకు వచ్చే ఆదివాసుల కొరకు మార్కెట్ యాల్లో సమావేశం నిర్వహించడంతోపాటు భోజన వసతి కల్పించాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సార్ మేడిలు మెస్రం వెంకట్రావు, కోట్లకి బిర్షివ్, మెస్రం చిన్ను పటేల్, కొమరం భీమ్ ఆవిష్కరణ కమిటీ నాయకులు పాల్గొన్నారు.