అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు
26-10-2026 | 11:08am
కూసుమంచి, అక్టోబర్ 26 (విజయక్రాంతి): హైదరాబాద్ నుండి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ (RTC) బస్సు సోమవారం తెల్లవారుజామున కూసుమంచి మండలం లింగారంతండా సమీపంలో అదుపుతప్పి పత్తి చేలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇరువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఎక్కువ మంది ప్రయాణికులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అతి వేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు (Investigation) చేస్తున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు (Hospital).