పార్కు స్థలంపై అధికారుల స్పందన

26-10-2026 | 11:30am

పార్కు స్థలంలో బోరింగ్‌ పనులపై స్పందించిన అధికారులకు కృతజ్ఞతలు

మణికొండ, అక్టోబర్ 26 (విజయక్రాంతి): తిరుమల హిల్స్‌ కాలనీ రోడ్‌ నంబర్‌–7లోని పార్కు స్థలంలో బోరింగ్‌( Park Borewell Inquiry) వ్యవహారంపై స్పందించి, క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టిన సంబంధిత అధికారులకు డాక్టర్‌ పి. అన్వేష్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో సహకరించిన మీడియా మిత్రులకు, ప్రజా ప్రయోజనాల పరిరక్షణకు తోడ్పడిన ప్రతి ఒక్కరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పార్కు స్థలాల పరిరక్షణకు అధికారులు, ప్రజలు సమన్వయంతో కృషి చేయాలని, ప్రజలకు ఉపయోగపడే స్థలాలను కాపాడుకోవడం అందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు