ఫుట్‌బాల్ చరిత్రలో ఈరోజు

26-10-2026 | 11:53am

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానించే ఫుట్‌బాల్‌ (Football) ఆటకు ఒకే విధమైన నియమాలు రూపొందించాలనే లక్ష్యంతో 1863 అక్టోబర్ 26న లండన్‌లో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశం ఫలితంగా ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (Football Association) ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఆ తర్వాత 1886లో అంతర్జాతీయ ఫుట్‌బాల్ నియమాలను పర్యవేక్షించేందుకు అంతర్జాతీయ ఫుట్‌బాల్ అసోసియేషన్ బోర్డు (IFAB) ఏర్పాటైంది.

నేడు ఆటగాళ్లు మైదానంలో ఎలా ఆడాలి? రిఫరీలు నిర్ణయాలు ఎలా తీసుకోవాలి? అనే అంశాల్లో ఫుట్‌బాల్ నియమావళి (Rules of the Game) కీలక పాత్ర పోషిస్తోంది. ఇదీ ఫుట్‌బాల్ చరిత్రలో అక్టోబర్ 26 ప్రత్యేకత!

మరిన్ని వార్తలు