కలెక్టర్ పేరిట ఫేక్ ఐడీలు
26-10-2026 | 11:44am
కామారెడ్డి, అక్టోబర్ 26 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఖాతాలు (Fake Profiles) సృష్టించారు. వాట్సాప్, ఫేస్బుక్లో నకిలీ ప్రొఫైల్స్ (Social Media Profiles) ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తించిన కలెక్టర్ పరిపాలనాధికారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన సోమవారం దేవునిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కలెక్టర్ పరిపాలనాధికారి ఫిర్యాదు మేరకు దేవునిపల్లి పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులపై కేసు (Cyber Crime Case) నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నకిలీ ఖాతాలు సృష్టించిన వారిని గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.