కార్తీక దీపం అంటుకుని యువతి మృతి
కార్తీక దీపం రూపంలో మృత్యువు.. 18 ఏళ్ల యువతి కన్నుమూత!
హైదరాబాద్: కార్తీక దీపం(karthika deepam) వెలిగించే సమయంలో జరిగిన ప్రమాదం ఓ యువతి ప్రాణాలను బలితీసుకుంది. ఎంతో భక్తితో వెలిగించిన దీపమే చివరకు ఆమె పాలిట మృత్యువుగా మారింది. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డగుట్ట వెస్ట్రన్ హిల్స్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. 18 ఏళ్ల సాయి వెంకట సింధు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. సింధు రోడ్ నంబర్ 5లో SS Boutique నిర్వహిస్తూ జీవనం సాగిస్తోంది. ఈ నెల 12న రాత్రి తన షాప్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఇంటి గేటు వద్ద ప్రమాదం జరిగింది. గేటు దగ్గర వెలిగించిన Karthika Deepam అనుకోకుండా ఆమె చీరకు అంటుకుంది. క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో సింధు తీవ్రంగా గాయపడింది. ఊహించని ఈ ప్రమాదంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో శుక్రవారం ప్రాణాలు కోల్పోయింది. Fire Accidentలో తీవ్రంగా గాయపడిన యువతి చివరకు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. చిన్న వయసులోనే సింధు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అడ్డగుట్ట వెస్ట్రన్ హిల్స్ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.