బస్సు ఢీకొని ఇద్దరు మృతి
నార్సింగి/చేగుంట అక్టోబర్ 05, విజయక్రాంతి: మెదక్ జిల్లా నార్సింగి మండల పరిధిలోని జాతీయ రహదారి–44 (National Highway-44)పై కాస్లాపూర్ వద్ద సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మహిళపై నుంచి బస్సు వెళ్లడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. మరో వ్యక్తి కూడా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు (Police) వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ప్రమాద వివరాలను పరిశీలించారు.మృతదేహాలను స్వాధీనం చేసుకుని రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.