ఈసీ ఆఫీస్‌ వద్ద టెన్షన్‌..మీడియాకు నో ఎంట్రీ

06-10-2026 | 09:42am

ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. భద్రతా చర్యల్లో భాగంగా అధికారులు పలు ఆంక్షలు (Restrictions) విధించి, వాటిని కొనసాగిస్తున్నారు.ఈసీ కార్యాలయం (EC Office) పరిసరాల్లోకి సాధారణ ప్రజలను అనుమతించకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. మీడియా ప్రతినిధులను సైతం ఈసీ కార్యాలయం ముందుకు వెళ్లేందుకు పోలీసులు అనుమతించడం లేదు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే ఆంక్షలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పరిస్థితిని బట్టి భద్రతా ఏర్పాట్లను మరింత పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు