మద్యం మత్తులో పోలీసులపై దురుసు ప్రవర్తన.. వ్యక్తిపై కేసు నమోదు
నాగిరెడ్డిపేట్, సెప్టెంబర్ 8 (విజయ క్రాంతి): పోలీసులను అసభ్య పదజాలంతో దూషించిన వ్యక్తి పై కేసు నమోదు.స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్(SI Bhargav Goud) తెలిపిన వివరాల ప్రకారం...మండలంలోని పోచారం బ్రిడ్జి మీద మద్యం సేవించి ఆటోను నడి రోడ్డుపై నిలిపి ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్నారని,అక్కడ ఉన్న స్థానికులు 112 డయల్ ద్వారా సమాచారం అందించారు.అట్టి సమాచారం మేరకు విధుల్లో ఇద్దరు కానిస్టేబుళ్లు పోచారం బ్రిడ్జి వద్దకు వెళ్లి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న సమయంలో,మద్యం మత్తులో ఉన్న పోచారం గ్రామానికి చెందిన ముడ సాయిబాబా విధుల్లో ఉన్న ఇద్దరు కానిస్టేబుల్ కాలర్ పట్టుకుని తోసివేసి అసభ్య పదజాలంతో దూషించాడు.
అంతేకాకుండా విధులకు ఆటంకం కలిగిస్తూ కానిస్టేబుల్ను దూషిస్తూ బస్సు కింద పడి చనిపోతాను అని బెదిరింపులకు పాల్పడ్డాడని ఎస్సై.భార్గవ్ గౌడ్ తెలిపారు.ఈ సంఘటనపై విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది ఫిర్యాదు మేరకు సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టడం జరిగిందని ఎస్ఐ.భార్గవ్ గౌడ్ తెలిపారు.