‘శరత్’కాలానికి వెళ్దాం
ఇప్పటి తరాలకు పెద్దగా తెలియక పోవచ్చుగానీ మునుపటి తెలుగు పాఠకులకు శరత్ సాహిత్యం సుపరిచితమే. నాటి మధ్య తరగతి విద్యావంతుల్లో ఇంటిల్లిపాదీ శరత్ సాహిత్యాన్ని(The entire family [engages with] Sarat’s literature) చదివి చెమర్చారు. ఆయన బెంగాలీలో రాసినప్పటికీ అనువాదాలను చదివి తమ తెలుగు రచయితయే అన్నంతగా భావించి ఎంతో అభిమానించారు. శరత్ పేరు చెబితేనే వాళ్ల ముఖాల్లో ఒక వెలుగు, హృదయాల్లో ఒక భావోద్వేగ ప్రతిస్పందన కనిపిస్తాయి.
ఆయన రాసిన బడదీదీ, దేవదాసు, చరిత్రహీనులు, పల్లీ సమాజ్, భారతి, శ్రీకాంత్, శేషప్రశ్న ఇత్యాది కథలు, నవలల పేర్లు నోళ్లలో నానేవి. సవ్యసాచి, శ్రీకాంత్, కమల, కిరణ్మయి, భారతి, రమేష్, రాజ్యలక్ష్మి, గోకుల్ తదితర పాత్రలు వారి మనోఫలకాలపై చెరగని ముద్ర వేశాయి. ఎందుకంటే శరత్ రచనా శైలీ, కళాత్మక సృష్టి చాలా భి న్నంగా, ఎంతో హృద్యంగా ఉంటూ పాత్రల సంభాషణలు, వ్యక్తమయ్యే భావోద్వేగాలు సూటిగా హృదయాలలోకి చొచ్చుకుపోతా యి. ఆయన చేసిన రససృష్టి మనలను కట్టిపడేసి తన్మయత్వంలో ముంచుతుంది.
అయితే, ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా మారాయి. శరత్ కాలం నాటి సా హిత్య, సాంస్కృత్రిక వారసత్వాన్ని కొనసాగించడంలో మనం విఫలమయ్యాము. నేటి దురదృష్టం ఏమంటే ఒక్క శరత్ సాహిత్యమనే కాదు, అసలు సాహిత్య అధ్యయనమే ఎందుకూ కొరగానిదిగా భావించే తప్పుడు ధోరణికి బలికావడం. అలనాటి ఉత్కృష్ట సా హితీ సంపదను అనుభవించి, పలవరించే ఉత్తమాభిరుచికి దూరం కావడం. అందుకే మనుషుల సంబంధ బాంధవ్యాలలో సున్ని త మనోభావాలు, నైతిక ప్రమాణాలు నశి స్తూ, స్వార్థం, సంకుచిత మనస్థత్వం, వికృత, వికార ప్రవృత్తులు పెంపొందుతున్నాయి. మానవ విలువల రంగంలో వ్యాపిస్తున్న నేటి సంక్షోభాన్ని నివారించాలంటే ఉత్తమ సాహిత్య అభిరుచులను ముఖ్యంగా శరత్ సాహిత్య అధ్యయనాన్ని తిరిగి ఇతోధికంగా ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
శరత్ 138వ జయంతి సందర్భంగా 17 సెప్టెంబర్ 2013న కలకత్తాలోని మహాజతి సదన్‌లో ఒక సమావేశం జరిగింది. బెంగాలీ సాహిత్య పత్రిక ‘ప్రతికృత్’, ఏఐడీఎస్వో, ఏఐడీవైవో, ఏఐఎంఎస్ఎస్, కంసోమోల్ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎస్‌యూసీఐ (కమ్యూనిస్టు) పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ప్రవాష్ ఘోష్ ప్రసంగించారు. నేటి పరిస్థితులలో శరత్ సాహిత్య అధ్యయనం ఆవశ్యకత గురించి ఆయన బెంగాలీలో చేసిన ప్రసంగం పూర్తి పాఠాన్ని ఒక పుస్తకం 20 మే 2014న ప్రచురించారు.
ఈ పుస్తకం రెండుసార్లు పునర్ముద్రణ అయ్యింది. ఈ బెంగాలీ పుస్తక మూడో ముద్రణ ఇంగ్లీష్ అనువాదం 21 ఫిబ్రవరి 2017న ప్రచురితమైంది. దాని తెలుగు అనువాదాన్ని ప్రస్తుతం పాఠకులకు అందిస్తున్నాము. ఈ ప్రసంగంలో కామ్రేడ్ ప్రవాష్ ఘోష్ శరత్ సాహిత్యం ఆవశ్యకతను వివరిస్తూ శరత్ కథలు, నవలల్లోని పాత్రల ముఖ్యమైన సంభాషణలను విస్తృతంగా ఉటంకించారు. బెంగాలీలో శరత్ వ్యక్తపరచిన లోతైన భావాల గాఢతను వేరొక భాషలోకి సంతృప్తికరంగా అనువదించడం సాధ్యం కాకపోయినా మా శక్తి మేరకు ప్రయత్నించాం. అనువాదంలో లోపాలు, వ్యక్తీకరణ దోషాలు ఉంటే మేమే బాధ్యులం.
బీఎస్ అమర్నాథ్ కేంద్ర కమిటీ సభ్యుడు, సోషల్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్టు)