ఉక్కు మనిషి వల్లభాయ్ పటేల్
భారతదేశ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, దేశ మొదటి హోంమంత్రి, ఉప ప్రధాని, ప్రముఖ న్యాయవాది, స్వరాజ్య ఏకీకరణకు కృషి చేసిన గొప్ప జాతీయవాది, ఉక్కుమనిషిగా పేరొందిన ధైర్యశాలి, సర్దార్ వల్లభాయ్ పటేల్(Sardar Vallabhbhai Patel). గుజరాత్‌లోని నాడియార్‌లో జువేరీబాయ్, లాడ్ బాయ్ దంపతులకు 1875 అక్టోబర్ 31న జన్మించిన పటేల్.. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడే కాక, స్వాతంత్య్రానంతరం హైదరాబాద్, జునాగఢ్, కాశ్మీర్ వంటి 565 స్వదేశీ సంస్థానాలు భారతదేశంలో విలీనం కావడానికి గట్టి కృషిచేసి దేశంలో ప్రముఖుడిగా పేరుగాంచారు. రాచరిక రాష్ట్రాల ఏకీకరణ అనేది ప్ర పంచ చరిత్రలో ఒక అద్భుతంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇది మన దేశ రక్తర హిత విప్లవంగా చెప్పుకోవచ్చు. ఏకీకరణ కోసం అతనికి లోహపురుష్, బిస్మార్క్ ఆఫ్ ఇండియాగా బిరుదు ఇచ్చారు. ఏ దేశానికైనా బలం ఆదేశ ఐక్యతలోనే ఉంటుంది.
వివిధ మతాలు, భాషలు, ప్రాంతా లు, కులాలు, వర్గాలు ఉన్న మన దేశంలో మన సామరస్య జీవన విధానమే దేశ ఐక్యతను ప్రతిబింబిస్తుంది. ఇంగ్లాండ్‌లో బారి ష్టరు పట్టా పుచ్చుకొని భారత దేశానికి తిరిగి వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్.. మహాత్మాగాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న జాతీయోద్యమంలో పాల్గొ న్నారు. బార్జొ లీలో జరిగిన సత్యాగ్రహ ఉద్యమానికి నాయకత్వం వహించి, విజయవంతం చేసినందుకు దేశ ప్రజల దృష్టి ని ఆకర్షించారు. 1931లో భారత జాతీయ కాంగ్రెస్ సభకు అధ్యక్షత వహించిన అత డు రాజ్యాంగ రచనలో అతి ముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించారు.
కొన్ని సంవత్సరాలు అహ్మదాబాద్‌లో న్యాయవాద వృత్తిని చేపట్టిన ఆయనకు 1909లో తన భార్య ఝు వెర్బా క్యాన్సర్ వ్యాధితో మరణించింది. పటేల్ కోర్టులో ఒక కేసు వాదిస్తుండగా తన భార్య మరణ వార్త విని చలించిపోయారు. అప్పటినుంచి మళ్లీ వివాహం చేసుకోకుండానే న్యాయవాద వృత్తిని చేస్తూనే పిల్లలను ప్రయోజకులను చేసి, దేశ సేవకు అంకితమై జాతీయోద్యమంలో పాల్గొన్న గొప్ప పోరాటయోధుడు పటేల్. బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో సర్కారు విధించిన పన్నులకు వ్యతిరేకంగా కిసాన్ ఉద్య మం చేపట్టి విజయవంతం చేసినందుకు ‘సర్దార్’ అనే పేరు వచ్చింది.
గాంధీజీ చేపట్టిన సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొ ని దాదాపు 30 వేల మందితో 15 లక్షల రూపాయల విరాళాలు సేకరించడం, గుజరాత్లో మద్యపాన నిషేధం, అస్పృశ్యత, కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడారు. 1947 నుంచి 1950 వరకు అనేక పదవులు నిర్వహించిన ఆయన కొన్ని సంద ర్భాల్లో నెహ్రూ ప్రవచించిన సోషలిజాన్ని సైతం వ్యతిరేకించారు. ఆనాటి కాలంలో కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితికి నివేదిక ఇవ్వడంలో నెహ్రూతో విభేదించి, నివేదికను ఐక్యరాజ్యసమితికి సమర్పించడం అతని ధైర్యసాహసాలకు నిదర్శనం. పాకిస్థాన్‌కు 55 కోట్ల రూపాయల విరాళం ఇవ్వడాన్ని వ్యతిరేకించారు.
రాష్ట్రపతి ఎన్నికలలో నెహ్రూ.. రాజగోపాలచారి వైపు మొగ్గు చూపగా, వల్లభాయ్ పటేల్ డాక్టర్ రాజేంద్రప్రసాద్‌ను ప్రతిపాదించి సఫలమయ్యారు. 1950లో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో జవహర్ లాల్ నెహ్రూ అభ్యర్థి కృపలానిని కాదని, పురుషోత్తమ దాస్ టాండన్‌ను గెలిపించి నెహ్రూకు విరోదుదైయ్యారు. దేశ స్వాతంత్య్రానంతరం 565 స్వదేశీ సంస్థానాలు విలీనం చేస్తున్న క్రమంలో జమ్మూ కశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్ ఈ మూడు రాచరిక సంస్థానాలు భారతదేశంలో విలీనం కావడానికి నిరాకరించిన సందర్భంలో పటేల్ చాకచక్యంతో వ్యవహరించారు. ఆ తర్వాత జునాగఢ్ రాజ్యంలో భారీ వ్యతిరేకత రావడంతో హిందుస్థాన్ నుంచి నవా బు పారిపోయాడు.
కశ్మీర్ రాజు హరిసింగ్ తన రాజ్యం బాధ్యతను సమీక్షించుకొని కశ్మీర్‌ను దేశంలో విలీనం చేశాడు. కానీ చివరగా హైదరాబాద్ నిజాం ప్రభువు భా రత్‌లో కలపడానికి నిరాకరించినప్పుడు వల్లభాయ్ పటేల్ వెంటనే సైన్యాన్ని పం పించి నిజాంను లొంగిపోవాలని హెచ్చరించారు. ఆ తర్వాత భారత్‌లో విలీనం కావడం వల్ల మన దేశాన్ని కేంద్ర, రాష్ట్రాల దేశం అని పిలిచారు. అందుకే ప్రజలంతా ఐక్యత, సమగ్రతతో ఉన్నంతవరకు ఏ దేశం అయినా సురక్షితం అని చెప్పవచ్చు. బ్రిటిష్ వారు 200 సంవత్సరాలు మన దేశాన్ని పాలించారు. అంటే, దేశంలోని అన్ని రాష్ట్రాలు, రాచరిక రాష్ట్రాల మధ్య సమన్వయ లేకపోవడమే కారణంగా చెప్పవచ్చు. ఎలాంటి ఐక్యత లేనప్పుడు ఏ దేశం కూడా అభివృద్ధి సాధించలేదు.
అందుకే దేశాన్ని ఐక్యత వైపు మల్లించిన భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అతని జ్ఞాపకార్ధం భారతదేశ రాజకీయ సమైక్యతకు కృషి చేసిన అతని సహకారానికి ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’ అనే పేరుతో 2014 నుంచి అక్టోబర్ 31న జాతీయ ఐక్యతా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గుజరాత్‌లోని నర్మదా నది తీరాన సాదు బెట్ నుంచి 3.2 కిలోమీటర్ల దూరంలో వడోదర వద్ద చిన్న దీవిలో ప్రపంచంలోనే అతి ఎత్తున 182 మీటర్ల ఎత్తులో (597 అడుగులు) సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అక్టోబర్ 31, 2018 సంవత్సరం లో పటేల్ 143 జయంతి సందర్భంగా దా నిని ఆవిష్కరించి, జాతికి అంకితం చేశారు.
ఈ ప్రదేశం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది. సర్దార్ పటేల్ జ్ఞాపకార్ధం అనేక విద్యాసంస్థలు, విమానాశ్రయాలు, స్టేడియాలు, ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పడ్డాయి. తన మరణానంతరం 1991లో ‘భారతరత్న’తో ప్రభుత్వం గౌరవించింది. భరతమాత సేవ లో ప్రజలంతా ఒక్కతాటిపై నిలిస్తే ఏ ప్రభుత్వం ఏమి చేయలేదు అని భారతీయుల గుండెల్లో ధైర్యo నూరిపోసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్పవచ్చు. అందుకే అతడిని సర్దార్‌గా, ఉక్కు మనిషిగా, బిస్మార్క్ ఆఫ్ ఇండియాగా పిలవ డంలో అతిశయోక్తి లేదు. నిజమైన భారతీయుడి పట్ల దేశ సమగ్రతను కాపాడటమే నిజమైన జాతీయ భక్తిగా పేర్కొనవచ్చు.
ఇటీవల హనుమకొండ జిల్లా కేంద్రంగా ఉన్న విహారి విజ్ఞాన సమితి సభ్యులం సుమారు 42 మందిమి దసరా సెలవుల్లో సర్దార్ వల్లబాయ్ పటేల్ నిలువెత్తు విగ్ర హం చూశాం. సుమారు మూడు గంటలపాటు అక్కడ ఉన్నాం. రాత్రి లేజర్ షో కూడా తిలకించాం. వారి జీవిత చరిత్ర మొత్తం కూడా లేజర్ షోలో వివరిస్తూ ఉన్నారు. మ్యూజియంలో పటేల్, గాంధీ కలిసి ఉన్న చిత్రాలు ఎంతో బాగున్నాయి.
వ్యాసకర్త: జయశంకర్ భూపాలపల్లి జిల్లా. తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు,
సెల్: 9848445134
కామిడి సతీశ్‌రెడ్డి