సారస్వత విహారి ‘విహారి’

31-10-2026 | 05:00am

రామకథ ఎన్ని యుగాలకైనా సజీవంగా ఉండి మానవాళికి కర్త వ్యోపదేశం చేస్తుంది. విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం రాముని వ్యక్తిత్వానికి పట్టాభిషేకం చేయగా విహారి (జె.ఎస్.మూర్తి) రచించిన ‘శ్రీ పదచిత్ర రామాయణం(Sri Padachitra Ramayanam) 6,500 పద్యాలలో ఒక మహాకావ్యంగా అవతరించి పండిత లోకా న్ని అలరించింది. 

సాహిత్య చర్చల్లో పాల్గొన డం, సాహిత్య సభలకు అధ్యక్షత వహించడం విహారి దినకృత్యాల్లో భాగమయ్యా యి. డా.కె.వి. రమణాచారి నివాస భవనంలో జరిగిన పెండ్యాల కిషన్ ‘సుందర కాండ’ ఆవిష్కరణ సభకు విహారి అధ్యక్షుడు. ఆ సభలో నేనూ పాల్గొన్నాను. కట్టె కొట్టె, తెచ్చె అనే మాటలను నేను రాము డు ధర్మానికి పట్టం కట్టాడు, అధర్మాన్ని పడగొట్టాడు, శ్రేయోరాజ్యాన్ని తెచ్చాడు అని ప్రసంగించగా విహారి నా మాటలను ఆమోదించినట్లనింపిచింది. ఆ నాటి నుం చి వారితో సఖ్యత ఏర్పడింది. 

విహారిది బహుముఖీనమైన ప్రజ్ఞ. ప్రసిద్ధమైన అన్ని పత్రికలలో 350 పైగా కథలు రాశాడు. ఆయన రాసిన కథలను చాలామంది కథకులు నమూనాలు గా స్వీకరించారు. ‘గుండెలో కోయిల’, ‘అమ్మ పేరు చీకటి’, ‘అక్షరం’, ‘గోరంత దీపం’, ‘ప్రాప్తం’, ‘ఇల్లు వంటి వి కథా కార్యశాలల (సెమినార్ల)కు పాఠ్యాంశాలుగా మారాయి. ప్రపంచీకరణ ప్రభావంతో ఉత్తమ కథాత్మక విలువలతో అందించిన ‘కొత్తనీరు’, ‘సమాధానం’ లాంటి కథలు మేటి రచనలుగా చెప్పబడినాయి. 

విహారి 350 కథలు రాయడమేగాక, 350 కథానికల గుణ విశేషాలను విశ్లేషిస్తూ ఆయా పత్రికలకందించిన పరిచయ వ్యాసాలు తెలుగు సాహిత్యంలో చెప్పుకోదగిన అంశం. విహారి నూరు వ్యాసాలను ‘కథాకృతి’, ‘తెలుగు కథ పేరుతో సంపుటాలుగా తెచ్చారు.  ‘భారతి’ ‘నవ్య’ లాంటిపత్రిక’ లాంటి పత్రికల్లో సుమారు 300 గ్రంథ సమీక్షలు చేశారు. ఆంధ్ర సచిత్ర వారపత్రిక ద్వారా వరుసగా ఐదుసార్లు బహుమతి పొంద డం కథకులుగా ఆయన స్థానం ఎంతగొప్పదో తెలియజేస్తుంది.

విహారి కథల్లో కొన్ని తమి ళం, కన్నడం, ఆంగ్ల భాషల్లోకి అనువదింపబడినాయి. నవ్య లాంటి పత్రికల నుంచి విహారి ఎన్నో బహుమతులు పొందినాడు. మహాకవి కొండేపూడి సుబ్బారావు స్మారక పద్యకవితా సంపుటి పోటీలోను, సాహిత్య విమర్శనా సంపుటి పోటిలోను ఒకే సంవత్సరం రెండు అవార్డులు పొందడం విశేషం.

విహారికి తులనాత్మక పరిశీలన అంటేనే చాలా ఇష్టం. డా. రావూరి భరద్వాజ ‘పాకుడురాళ్లు’, డా. ప్రభాకర్ జైని ‘హీరో’ నవలలను తులనాత్మకంగా పరిశీలన చేసిన రచనకు గాను ‘జైనీ ఇంటర్నేషనల్’ వారి నుంచి 50వేల నగదు పారి తోషికం అందుకున్నారు.

సంస్కృతంలో ‘రసగంగాధరం’ అనే అలంకార గ్రంథం రచించిన ‘జగన్నాథ పండిత రాయలు’ చారిత్రాత్మక నవలను వ్రాసిన విహారి 50 మంది ప్రముఖ సాహితీ వేత్తల ప్రశంసలు పొందినారు. సుధామ ప్రోత్సాహంతో ‘సప్తపదు లు  నూట పదహార్లు’ పేరుతో తొలి సప్తపది సంపుటిని వెలువరించారు.

విహారి సాహిత్యంపై వివిధ విశ్వ విద్యాలయాలలో విస్తృతమైన పరిశోధన జరిగింది. ఓ.యూలో ఏలె విజయ లక్ష్మి పిహెచ్.డి. చేశారు. నాగార్జున విశ్వ విద్యాలయంలో వేమూరి సత్యవతి పీహె చ్.డి. చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వి. విజయేశ్వరరావు పీహెచ్.డి చేశారు. విహారి రచించిన ‘శ్రీపదచిత్ర రామాయణం’ మీద గుమ్మ సాంబశివరావు, టి. శ్రీరంగస్వామి, సూర్య భాస్కర్ మొదలైనవారు ప్రత్యేకంగా గ్రంథాలే రాశారు.

కథలు రాయడమంటే విహారికి వెన్నతో పెట్టిన విద్య. విహారి కథలు చదవడమంటే పాఠక లోకానికి పండుగ. లోకానుభవాన్ని, నైతికతను రంగరించి విహారి ఎన్నో కథలు రాశాడు. వారి కథలను విశ్లేషించని విమర్శకుడు తెలుగునాట లేడంటే అతిశయోక్తికాదు. మునిపల్లె రాజు, మధురాంతకం రాజారాం, ఆర్.ఎ స్. సుదర్శనం, అబ్బూరి ఛాయాదేవి, కేతు విశ్వనాథ రెడ్డి, మంజుశ్రీ, పోరంకి దక్షిణామూర్తి, కొలకలూరి ఇనాక్, బి.ఎస్. రాము లు, ద్వానాశాస్త్రి, రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, ఎన్.గోపి మొదలైన వారు వారి కథలను పరామర్శించిన వారిలో ముఖ్యులు. అట్లే ‘శ్రీ పదచిత్ర రామాయణం’ మీద ప్రశంసల జల్లు కురిపించిన వారిలో సినా రె, రవ్వా శ్రీహరి, పేర్వారం జగన్నాథం, బేతవోలు రామబ్రహ్మం, కె.వి. రమణాచారి, ఆశావాది ప్రకాశరావు, కసిరెడ్డి వెంక టరెడ్డి ముఖ్యులు.

విహారి అందుకున్న సన్మానాలు, పురస్కారాలు అనేకం. 1977లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న విహారి తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభా పురస్కార గ్రహీతలు, కీర్తి పురస్కార గ్రహీతలు. ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం వారి కళారత్న పురస్కారంతో పాటు నోరి నరసింహ శాస్త్రి, శ్రీ పాద సుబ్రహ్మ ణ్య శాస్త్రి, ఆవంత్స సోమసుందరం పేర్ల మీద సాహిత్య పురస్కారాలు అందుకున్నారు. విహారి సుమారు 40 దాకా సాహిత్య పురస్కారాలందుకున్నారు. ఎన్ని సన్మానాలు పొందినా, ఎన్ని పురస్కారాలు అందుకున్నా, ఆయన నిగర్విగా, ఒక ఆదర్శ కథా రచయితగా, పద్యకవిగా అందరికీ స్నేహపాత్రుడు.

విహారి బహుభాషావేత్త. కేంద్ర అకాడమీ వారి “ఎన్ సైక్లోపీడియా ఆఫ్ ఇండియన్ రైటర్స్‌” గ్రంథంలో సుమారు 45 మంది తెలుగు సాహిత్య వేత్తల జీవనరేఖల్ని ఆంగ్లంలో అందించడం విశేషం.  విహారి కథా సంపుటాల్లో స్పృహ, గోరంతదీపం, అక్షరం, అమ్మ పేరు చీకటి, గుండెలో కోయిల, బొంగరం, కొత్తనీరు, ప్రాప్తం, చిరంజీవి ఆశ, మౌనలిపి, విగతం, కిటికీ తెరిస్తే, మాయతెర, విహారి కథలు, కూకటి వ్యూహం, నిప్పు నుంచీ నీరు మొదలైనవి సాహితీ లోకాన్ని అలరించినవి. విహారి రాసిన నవలల్లో సమశ్రుతి, విజేత, నవతరం, ప్రణయానలం, ధైర్యే సాహసే, సమాంతరాలు ముఖ్యమైనవి. ఈ నవలల్లో కెల్లా ‘జగన్నాథ పండిత రాయలు’ తలమానికం. విహారి కవితా సంపుటాల్లో చలనం, కలం కన్ను, చీకటి నాణెం, మనం సప్తపది పదహార్లు ముఖ్యమైనవి.

విహారి రచించిన వ్యాస సంపుటాలు 25. పద్య కవితా సంపుటాలు 8. వచన కావ్యాలు 3. స్వీయ సాహిత్య సమాలోకన గ్రంథాలు 3. ఇతరులతో సంపాదకత్వం వహించిన గ్రంథాలు 7. విహారి ‘నేనూ ప్రపంచం’ (ఈ.బుక్) పేరుతో అశేష పాఠక జనుల హృదయాలకు చేరువయ్యారు. ఒకమాటలో చెప్పాలంటే విహారిది సహృదయ సారస్వత సమున్నత విహారం!

వ్యాసకర్త సెల్: 9885654381

ఆచార్య మసన చెన్నప్ప

మరిన్ని వార్తలు