బాధ్యులెవరైనా బాధితులు ప్రజలే
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో(Undivided Andhra Pradesh) 2001 2003 మధ్య ఏర్పడిన తీవ్ర కరు వు ఛాయలు.. ఇప్పుడు ఎల్ నినో ప్రభావంతో మరొకసారి తెలంగాణ రాష్ట్రం ఎదుర్కోబోతున్నదా? అనే భయాందోళనలు ప్రజల్లో నెలకొన్నాయి. తెలంగాణ ప్రముఖ వాగ్గేయకారుడు గోరేటి వెంకన్న రాసిన ‘పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా..’ పాట నాటి కరువు పరిస్థి తులకు అద్దం పట్టింది. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధార ణంగా వేడెక్కటం వల్ల సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది.
మరోవైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో భారత్ సహా ప్రపంచంలో వందకు పైగా దేశాలు ఎల్ నినో బారిన పడే అవకాశాలు ఉన్నాయని పర్యావరణవేత్తలు భావిస్తున్నారు. భారత్‌లో 12 రాష్ట్రాల్లో ప్రభావం ఉండగా, దక్షి ణాదిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు కూడా ప్రభావితం కాబోతున్నాయనే హెచ్చరికలు అందుతున్నాయి.
తెలంగాణలో నీటి కష్టాలు!
ఎల్ నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బలహీనపడటం తెలంగాణలో సాధారణం కంటే 17 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ఫలితంగా 14 లక్షల ఎకరాల మేర సాగు విస్తీర్ణం తగ్గింది. 20 లక్షలకు పైగా ఎకరాల్లో పంటలెండిపోయాయి. మరోవైపు పగటిపూట ఉష్ణోగ్ర తల తీవ్రత పెరిగి విద్యుత్ డిమాండ్ 20 వేల మెగావాట్లకు చేరింది. జలాశయాల్లో నీటిమట్టం అడుగంటుతున్నది. తాగునీరు, సాగునీరుకు ఇబ్బందులు ఎదురవుతున్నా యి. విద్యుత్ ఉత్పత్తికి ఆటంకాలు కలుగుతున్నాయి. దక్షిణాదిలోని మిగతా రాష్ట్రాల తో పోలిస్తే తెలంగాణలో ఎల్ నినో ప్రభా వం తీవ్రంగా కనపడుతున్నది.
ప్రభుత్వ వైఫల్యమా?
ఎల్ నినో లాంటి ప్రకృతి విపత్తులను ఆపలేం. కానీ, ఎదురయ్యే పరిణామాలను తట్టుకునే ప్రణాళికలను ప్రభుత్వాలు సిద్ధం చేసుకోవాలి. తగు చర్యలు చేపట్టాలి. కానీ దేశంలో మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు తెలంగాణలో ఎల్ నినో ప్రభావం ఎక్కువగా కనపడటానికి సమస్య తీవ్రత పట్ల ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించకపోవడమే. ఫలితంగా రాష్ట్రంలో దరిదా పు 375 మండలాల్లో కరువు నెలకొందని విపక్షాలు వాదిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఒక అడుగు ముందుకేసి ‘ఇది కాలం తెచ్చిన కరువు కాదు..
కాంగ్రెస్ తెచ్చిన కరువు..’ అంటూ ప్రభుత్వంపై గగ్గో లు పెడుతున్నది. ఎల్ నినో ప్రభావంతో తెలంగాణలో సాధారణం కంటే 17 శాతం వర్షపాతం తక్కువ నమోదు కావడంతో సాగు, తాగునీరు సమస్య ఏర్పడుతున్నది. 15 ప్రధాన జలాశయాల్లో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు కేవలం 381 టీఎంసీలు. గత సంవత్సరం ఈ సమయానికి 722 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. అలాగే రాష్ట్ర పరిధిలోని జలాశయాలలో గత సంవత్స రం ఈ సమయానికి 460 టీఎంసీల నీటి లభ్యత ఉంటే ప్రస్తుతం 200 టీఎంసీల కంటే తక్కువగా ఉంది.
దీంతో ఇప్పటికే వానాకాలం సాగులో 20 లక్షలకు పైగా ఎకరాల పంటలు ఎండిపోయాయి. ఇక యాసంగిలో 64 లక్షల ఎకరాల్లో క్రాఫ్ హా లిడే ప్రకటించే అవకాశాలున్నాయని సమ గ్ర నీటి ప్రణాళిక - నిర్వహణ కమిటీ (స్కి వం) అంచనా. క్రాఫ్ హాలిడే ప్రకటిస్తే రైతులకు 20 వేల కోట్ల రూపాయల పంట న ష్టం జరుగుతుందని జయశంకర్ వ్యవసా య విశ్వవిద్యాలయం అంచనా వేసింది.
నీళ్లొదిలేశారా?..
కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం ప్రాజెక్టులో కేవలం 60 టీఎంసీలు, గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్‌లో కేవలం 38 టీఎం సీలు మాత్రమే నీటి నిల్వలున్నాయి. గోదావరి బేసిన్లో ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు పడి ప్రాణహిత నదికి వరద పెరుగుతుంది. ఆ సమయంలో కాళేశ్వరం బరా జ్ల ద్వారా వరద నీటిని ఎత్తిపోయకుండా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది. చంద్ర బాబునాయుడుపై ఉన్న ప్రేమతో తెలంగాణ సర్కారు నీటిని విడిసిపెట్టారు.. వారు ఒడిసిపట్టారు.. కాబట్టే రాష్ట్ర రైతాంగానికి నీటి సమస్య ఏర్పడిందని ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నది.
ఎక్కడో 750 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పం రైతులకు నీళ్లు ఎలా వెళ్లాయనే విషయం విపక్షం తెరపైకి తేవడంతో ప్రభుత్వంపై రైతుల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. జలాశయాల్లో నీరు ఎత్తిపోయటంలో, సాగునీటి నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యంపై రైతాంగంలో చర్చ జరుగుతున్నది. జూరాల ప్రా జెక్టు ఆయకట్టు కింద పంటలకు నీరివ్వకపోవడంతో రైతులు ఆందోళన చేసిన తరు వాతనే ప్రభుత్వం స్పందించింది. కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి నారాయణపూర్ రిజర్వాయర్ నుండి వారాబం దీ పద్ధతిలో మూడు టీఎంసీల నీటిని తెలంగాణ ప్రభుత్వం తీసుకురాగలగడం రైతులకు తాత్కాలిక ఉపశమనం కలిగించింది.
కరెంట్‌కూ కటకటే?
ఎల్ నినో ప్రభావం సాగునీటిపైనే కాదు, విద్యుత్‌పైనా పడుతున్నది. గత సం వత్సరం ఈ సమయంలో 15 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంటే ఈసారి 20వేల మెగావాట్లకు చేరింది. అయితే, థర్మల్ పవర్ ప్లాంట్లకు కావలసిన బొగ్గు అందించకపోతే భవిష్యత్తులో విద్యుత్ కోతలు తప్పవనే ఆందోళన కలుగుతున్నది. ౪ వేల మెగావాట్ల సామర్థ్యం గల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో పూర్తిస్థాయిలో కరెంట్ ఉత్పత్తి జరగకపోవడం భవిష్యత్తు కొరతను ఎత్తిచూపుతోం ది.
అదే జరిగితే 30 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు 24 గంటల ఉచిత విద్యుత్ ఎలా ఇవ్వగలుగుతారు? కోతలు లేకుండా గృహ, పారిశ్రామిక అవసరాలకు ఎలా విద్యుత్ సరఫరా చేయగలుగుతారనే సం దేహాలు వ్యక్తమవుతున్నాయి. జలాశయాలలో నీటి నిల్వలు లేకపోవడం వలన హై డల్ విద్యుత్ ఉత్పత్తి కూడా తగ్గిపోవటంతో సమస్య మరింత జఠిలం అవుతు న్నది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీళ్లు కొనలేం.. కొందామన్నా విద్యుత్ దొరకటం లేదు.. అని చెప్పటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది.
ఆదుకోవాల్సింది ప్రభుత్వమే!
ఎల్ నినోపై ప్రభుత్వం ఏమి చెబుతుందనేది కాదు.. దాన్నుంచి రైతాంగాన్ని, వ్య వసాయ కూలీలను, సాధారణ ప్రజలను ఎలా ఆదుకుంటారనేది ముఖ్యం. కరువు నివారణ చర్యలపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది ప్రభుత్వం. సాగునీరు ఇవ్వ లేం.. కాబట్టి యాసంగి పంటలు వేయొద్దని ప్రభుత్వమే సూచిస్తున్న వేళ నష్టపో తున్న రైతాంగాన్ని ఆదుకోవటానికి రైతు భరోసాతో పాటు ప్రతి రైతుకు 20వేల రూపాయల ప్రత్యేక ఆర్థిక సాయం అం దించాలి.
అలాగే పంటలేయకపోవడం వల్ల పనులు కోల్పోతున్న కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పనులతో పాటు గత మూడు బడ్జెట్లలో ఇం దిరమ్మ ఆత్మీయ భరోసా కింద ప్రభుత్వం కేటాయించిన 1800 కోట్ల రూపాయలను ఒక్కొక్కరికీ 12 వేల రూపాయల చొప్పున ఇవ్వాలి. దేశంలో ఆహార ద్రవ్యోల్బణం అత్యధికంగా ఉన్న రాష్ట్రం తెలంగాణే.. కాబట్టి నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో ఉంచడానికి ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యంతో పాటు ఇతర నిత్యావసర వస్తువులు పంపిణీ చే యాలి.
కరువు.. కాలం తెచ్చినా! కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినా! బాధితులు ప్రజలే కాబట్టి.. ఎల్ నినోతో ఎదురయ్యే సమస్యల నుండి ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఎల్ నినో సూపర్ ఎల్ నినోగా మారితే ఈ విపత్తు రాష్ట్ర ప్రగతికి ఒక ప్రతిబంధకంగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయాలను పక్కనపెట్టి గత ప్రభుత్వ విధానాలపై, కేసీఆర్‌పై విమర్శలకే పరిమితం కాకుండా సమస్యను ఎదుర్కొనే ముందస్తు ప్రణాళికలతో విపత్తును సమర్థవంతంగా ఎదు ర్కొంటేనే ప్రజలకు మేలు జరుగుతుంది.
వ్యాసకర్త: అసిస్టెంట్ ప్రొఫెసర్, 9885465877